
బెంగళూరు: టీమిండియా లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి చేరారు. అక్కడే ఈ ఇద్దరు రిహాబిలిటేషన్‌లో పాల్గొననున్నారు. హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీతో రోహిత్, మోకాలి గాయంతో జడేజా.. సౌతాఫ్రికా టూర్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఎన్‌సీఏలో ఉన్న అండర్–19 టీమ్‌కు రోహిత్ పాఠాలు చెబుతున్న ఫొటోను కెప్టెన్ యష్ దుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ నెల 23 నుంచి జరిగే ఆసియా కప్ కోసం అండర్–19 టీమ్ ఇక్కడే ప్రిపేర్ అవుతున్నది. రోహిత్ మూడు, నాలుగు వారాల్లో కోలుకునే చాన్స్ ఉండగా, జడ్డూకు కాస్త ఎక్కువ టైమ్ పట్టొచ్చు. హిట్‌మ్యాన్ ప్లేస్‌లో ఇండియా–ఎ కెప్టెన్ ప్రియాంక్ పంచల్‌ను సఫారీ టూర్‌కు పంపారు.