టార్గెట్ ‘స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాయ్’

టార్గెట్ ‘స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాయ్’
  • టోనీ ద్వారా ఆఫ్రికన్​ డ్రగ్స్​ స్మగ్లర్​ వివరాలు రాబడుతున్న పోలీసులు
  • మొదటి రోజు పోలీస్ కస్టడీలో ప్రశ్నల వర్షం
  • దేశంలో డ్రగ్స్​ సరఫరా ఏజెంట్ల వివరాలపై ఆరా

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,వెలుగు: టోనీని కస్టడీలోకి తీసుకొని విచారణ మొదలుపెట్టిన పోలీసులు ఇంటర్నేషనల్​డ్రగ్స్​ స్మగ్లర్ ​ఆఫ్రికన్ ‘స్టార్​బాయ్’ వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. శనివారం చంచల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడ జైలు నుంచి టోనీని పంజాగుట్ట పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. సీపీ సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలోని స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోనీని ఇంటరాగేట్ ​చేస్తోంది. మొదటి రోజు విచారణలో టోనీకి సంబంధించిన వ్యక్తిగత వివరాలతో స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డ్ చేశారు. ముంబై, గోవాలో షెల్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి ఆరా తీశారు. ఆఫ్రికన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రగ్ స్మగ్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ను పట్టుకోవడమే టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా టోనీని క్వశ్చన్ చేస్తున్నారు. ఆఫ్రికా నుంచి ముంబై షిప్​యార్డుకు వస్తున్న కొకైన్, ఇతర డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశంలోని ఎన్ని రాష్ట్రాలకు సప్లయ్ చేస్తున్నారనే కోణంలో వివరాలు రాబట్టారు. ముంబై, గోవా ఏజెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కస్టమర్ల లింక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలుసుకున్నారు.

కస్టమర్ల గుట్టువిప్పుతున్నారు
మెట్రో పాలిటన్ ​సిటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న పబ్​లు, రెస్టారెంట్లు, హైఫై హోటల్స్‌‌‌‌‌‌‌‌తో పాటు పలు ఈవెంట్లకు టోనీ వెళ్లేవాడు. అక్కడ బిజినెస్​మెన్, వీఐపీలను పరిచయం చేసుకునేవాడు. కాంటాక్టు డిటెయిల్స్​ వారికి ఇచ్చి కొకైన్ ​నెట్‌‌‌‌వర్క్ ​పెంచుకున్నాడు. ఏజెంట్ల నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్  ఏర్పాటు చేసుకున్న టోనీ.. వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కస్టమర్ల నుంచి ఆర్డర్స్ తీసుకునేవాడు. ముంబై అంధేరీకి చెందిన 9 మందిని డ్రగ్స్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టర్లుగా ఉపయోగించాడు. ఏజెంట్లకు డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కలవకుండానే డ్రగ్స్ అందించేవాడు. ఇలా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక్కొక్కరు10 సార్లు టోనీ వద్ద డ్రగ్స్​ ఆర్డర్‌‌‌‌ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చే ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇమ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నూర్ మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను సిటీకి పంపించేవాడు. హిమాయత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన కాంట్రాక్టర్ నిరంజన్ కుమార్ జైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముప్పైసార్లు కొకైన్ ఆర్డర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. టోనీ నుంచి 60 మందికి పైగా కస్టమర్లు రిపీటెడ్‌‌‌‌గా డ్రగ్స్ ఆర్డర్స్ చేసినట్లు వివరాలు సేకరించారు. 

ఆఫ్రికా టు ముంబై..
నైజీరియాకు చెందిన టోనీ 2013లో ముంబైకి వచ్చాడు. కొంత కాలం గార్మెంట్స్, విగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిజినెస్ చేశాడు. ఈ క్రమంలోనే ఆఫ్రికన్ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఫోన్​ద్వారా పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో టోనీ దేశంలోని నైజీరియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి కొకైన్ సప్లయ్ చేసేందుకు ప్లాన్ చేశాడు. స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాయ్ ఆఫ్రికా దేశాల నుంచి ఇండియాకు ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ అయ్యే గూడ్స్​ఆర్టికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొకైన్ ప్యాక్ చేసి ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేవాడు. షిప్పింగ్ సర్వీసెస్‌‌‌‌లో వచ్చే ఆర్టికల్స్‌‌‌‌ను టోనీ కలెక్ట్ చేసుకొని మరో ఇద్దరు నైజీరియన్స్‌‌‌‌తో కలిసి అంధేరీలోని ఓ సీక్రెట్ ప్లేస్‌‌‌‌కు తీసుకువెళ్లి ఆర్డర్స్ వారీగా ప్యాక్ చేసేవారు. ఏజెంట్ ఇమ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబు షేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నూర్ మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు మరో ఆరుగురు ఏజెంట్లకు డ్రగ్స్ అందించేవాడు.