నేవీలోకి ఐఎన్ఎస్ మొర్ముగావ్ యుద్ధనౌక

నేవీలోకి ఐఎన్ఎస్ మొర్ముగావ్ యుద్ధనౌక

రానున్న రోజుల్లో మన అవసరాలకు పోను.. ప్రపంచ అవసరాలకు యుద్ధ నౌకలను తయారు చేసేస్థాయికి ఎదుగుతామని డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఇవాళ ఇండియన్ నేవీలోకి ఐఎన్ఎస్ మొర్ముగావ్ యుద్ధనౌకను ప్రవేశపెట్టారు. స్వదేశంగా తయారు చేసిన INS మొర్ముగావ్ యుద్ధనౌకను ముంబైలోని నావల్ డాక్ యార్డులో రాజ్ నాథ్ సింగ్ నేవీకి అందజేశారు. 

ఈ షిప్ పొడవు 163 మీటర్లు, వెడల్పు 17 మీటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బరువు 7 వేల 400 టన్నులు ఉందన్నారు. అత్యాధునిక సెన్సర్లు, రాడార్, వెపన్ సిస్టమ్ ఉన్న ఈ వార్ షిప్... శత్రువుల మిసైళ్లను గుర్తించి నాశనం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ యుద్ధనౌక స్వదేశి రక్షణ ఉత్పత్తి సామర్థ్యానికి నిదర్శనమని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.