అట్టహాసంగా ఏఆర్‌ రెహమాన్‌ పెద్ద కూతురు పెళ్లి

అట్టహాసంగా ఏఆర్‌ రెహమాన్‌ పెద్ద కూతురు పెళ్లి

ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌, ఆస్కార్‌ విన్నర్‌ ఏఆర్‌ రెహమాన్‌ పెద్ద కూతురు ఖతీజా రెహజాన్‌ వివాహం అట్టహాసంగా జరిగింది. రియాస్దీన్ షేక్ మహమ్మద్‌ అనే సౌండ్‌ ఇంజనీర్‌తో ఈనెల 5వ తేదీన పెద్దల సమక్షలోం పెళ్లి జరిగింది. రియాస్దీన్  తెల్లటి షేర్వానీలో మెరిసిపోగా, ఖతీజా ప్రింటెడ్ ఆఫ్-వైట్ దుస్తుల్లో ముస్తాబై తళుక్కుమంది. పెళ్లికి సంబంధించిన ఫోటోను స్వయంగా ఖతీజా షేర్‌ చేశారు. ‘మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్లి జరిగింది. ఈ రోజు కోసం ఎంతో ఎదురుచూశాను’ అంటూ పోస్ట్‌ చేశారు. ఏఆర్ రెహమాన్‌ కూడా నూతన జంటను దీవించాలంటూ ఫోటోను షేర్‌ చేశారు. పలువురు సినీ ప్రముఖులు సహా నెటిజన్ల నుంచి కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తల కోసం.. 

కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యండిల్ ను బ్లాక్ చేసిన కేటీఆర్

ఐస్ క్రీమ్ అమ్ముకుంటున్న పారా అథ్లెట్ సచిన్ సాహు