డిఫరెంట్ కాన్సెప్టులు సెలెక్ట్ చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు సత్యదేవ్. తను నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘సమవర్తి’. అజయ్ నాగ్ వి దర్శకత్వంలో శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి నిర్మిస్తున్నారు.
రీసెంట్‌గా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసిన సినిమాపై ఆసక్తి పెంచారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి ‘బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి’ పేరుతో మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. విష సర్పాలు, క్రూర మృగాలు ఉన్న ప్రమాదకరమైన అడవుల్లో ఈ మూవీ షూటింగ్ ఎంత సాహసోపేతంగా చేశారో ఈ గ్లింప్స్‌లో కనిపిస్తోంది.
సౌతిండియాలోని 7 అరణ్య ప్రాంతాల్లో, ఇప్పటిదాకా ఎవరూ వెళ్లని 42 లొకేషన్స్‌లో చిత్రీకరిస్తున్నట్టు తెలియజేశారు. ‘సృష్టికైనా, వినాశనానికైనా ఒక పిలుపు రావాలి, ఒక పోరాటం పుట్టాలి, ఒక చిన్న యుద్ధం జరగాలి..’ అనే డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
