బంగారాన్ని పేస్టుగా చేసి చెప్పుల కింద దాచి..

బంగారాన్ని పేస్టుగా చేసి చెప్పుల కింద దాచి..
  • కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయిండు

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టుబడింది. విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న 14లక్షలు విలువచేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం పేస్ట్ గా తయారు చేసి క్యాప్సుల్ రూపంలోకి మార్చి  కాళ్లకు వేకుసునే చెప్పుల కింద దాచాడు. అయితే ఎయిర్ పోర్టులో అనుమానాస్పదంగా కనిపించిన ఆ వ్యక్తిని ఆపి సోదా చేయడంతో బంగారం బయటపడింది. పట్టుబడిన బంగారం 271 గ్రాములు ఉంటుందని అధికారులు వెల్లడించారు. పట్టుబడిన బంగారం మార్కెట్ విలువ 14 లక్షల 28 వేలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.