- ఇన్స్టాలో చూసి జలపాతానికి వెళ్లిన నలుగురు
- రూ.8 వేలు ఫైన్ విధించిన అటవీ అధికారులు
వెంకటాపురం, వెలుగు: నిషేధిత జలపాతానికి వెళ్లేందుకు ప్రయత్నించిన నలుగురిపై కేసు నమోదు చేసి రూ.8 వేల జరిమానా విధించినట్లు ఎఫ్‌ఆర్‌వో నరేందర్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. వరంగల్ ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులు అటవీ సిబ్బంది కళ్లుగప్పి అటవీ మార్గం గుండా గుండం జలపాతానికి వెళ్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో బీట్ అధికారి బాలు సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహించి వారిని అడవిలో అదుపులోకి తీసుకున్నారు.
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసి జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చినట్లు విచారణలో తెలిసింది. అనుమతి లేని అటవీ ప్రాంతంలో ప్రవేశించడం అటవీ శాఖ చట్టం ప్రకారం నేరమని ఎఫ్‌ఆర్‌వో పేర్కొన్నారు. నలుగురిపై కేసు నమోదు చేసి రూ.8 వేల జరిమానా విధించినట్లు తెలిపారు.
