ఇన్స్టాగ్రామ్ డౌన్...లక్షల మంది యూజర్ల ఇబ్బందులు

ఇన్స్టాగ్రామ్  డౌన్...లక్షల మంది యూజర్ల ఇబ్బందులు

ఇన్‌స్టాగ్రామ్ యాప్ మళ్లీ డౌన్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌ను యాక్సెస్ చేయడంలో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవుట్‌టేజ్ ట్రాకింగ్ సైట్ డౌన్‌ డిటెక్టర్ నివేదిక ప్రకారం ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులలో 56 శాతం మంది ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు.  లక్షా 80 వేల మందికి కంటే ఎక్కువ మంది వినియోగదారులు అంతరాయం కారణంగా ఇన్‌స్టాగ్రామ్ ను  యాక్సెస్ చేయలేకపోయారు.

ఏ ఏ ఇబ్బందులు..

డౌన్‌ డిటెక్టర్ నివేదిక ప్రకారం యూజర్లు ఇన్ స్టాగ్రామ్  లాగిన్ అవ్వడం, ఫోటో, వీడియో షేరింగ్ చేయడం, ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే దీని వల్ల ఎంత మంది వినియోగదారులు ప్రభావితమయ్యారనేది ఇంకా తెలియరాలేదు. కానీ కనీసం 2 లక్షల వరకు యూజర్లు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.  కానీ చాలా మంది యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌ని యాక్సెస్ చేయడంలో ఇబ్బంది పడుతున్నామని  ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తూనే ఉన్నారు.

ఇది  రెండోసారి..

ఈ ఏడాదిలో ఇన్‌స్టాగ్రామ్ డౌన్ కావడం ఇది రెండోసారి. 2023  మార్చి9వ తేదీ కూడా ఇన్ స్టా గ్రామ్ పనిచేయలేదు. వేలాదిమంది యూజర్లు యాప్​లో సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడ్డారు.  'డౌన్ ​డిటెక్టర్' నివేదిక ప్రకారం అమెరికాలో 46000 కంటే ఎక్కువ మంది యాప్ వినియోగదారులు ఇన్​స్టా యాక్సెస్​ చేసే సమయంలో​ సమస్యను ఎదుర్కొన్నట్లుగా సంస్థకు కంప్లైంట్​ చేశారు. యూకే, భారత్​, ఆస్ట్రేలియా సహా వివిధ దేశాల నుంచి వేలాది మంది యూజర్లు ఈ సమస్యపై మెటా సంస్థకు రిపోర్ట్​ చేసినట్లు 'డౌన్​ డిటెక్టర్' వెబ్​సైట్​ పేర్కొంది. గతంలో 2021లో కూడా ఇదే తరహాలో  ఇన్‌స్టాగ్రామ్  సేవలకు అంతరాయం కలిగింది. సాంకేతిక కారణాలతో తలెత్తే ఈ సమస్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా సోషల్​ మీడియాను వాడుతున్న వారు ఇబ్బందులు పడుతున్నారు.

డౌన్‌డిటెక్టర్ అంటే ఏమిటి..

డౌన్​డిటెక్టర్ వెబ్​సైట్ అనేది ఓ ఆన్‌ లైన్ ప్లాట్‌ఫామ్​.​ ఇది వరల్డ్ వైడ్ గా అనేక వెబ్‌సైట్‌లు, యాప్​లు అందించే సేవల వివరాలు.. దాని పనితీరును గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని వినియోగదారులకు  అందిస్తుంది. యూజర్ల నుంచి వచ్చే  ఫిర్యాదులు,  సూచనలు, సలహాలు, లోపాలతో సహా వివిధ మార్గాల్లో సమస్యల వివరాలను సేకరిస్తుంది. అన్వేషిస్తుంది, ట్రాక్​ చేస్తుంది. అనంతరం డేటాను క్రోడీకరించి వినియోగదారులకు చేరవేస్తుంది.