షాకింగ్ న్యూస్.. ఇన్ స్టా, ఫేస్ బుక్, వాట్సాప్ ల మాతృ సంస్థ మెటా తన యూజర్లకు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఇకపై తన ఫ్లాట్ ఫాంలకు కొత్త చెల్లింపు సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ను తీసుకువచ్చేందుకు సిద్దమవుతోంది. ఎడిషనల్ ఫీచర్లు, స్పెషల్ టూల్స్ అందించేందుకు ప్లస్ పేరుతో ప్రీమియం సేవలను తీసుకువస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. భారతదేశంతో పాటు పలు దేశాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి కంపెనీ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే గనక జరిగితే ఇన్ స్టా, ఫేస్ బుక్, వాట్సాప్ యూజర్లకు ఛార్జీల మోత తప్పదు.
రిపోర్టు ప్రకారం.. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ప్లస్ సేవలకు 387 రూపాయలు, వాట్సాప్ ప్లస్ సేవలకు 290 రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. అయితే మన దేశంలో వీటికి సంబంధించి ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు.
ఈ కొత్త ప్లాన్ లతో ప్రస్తుత ఉచిత సేవలు కొనసాగుతాయని అదనపు ఫీచర్ల కోసం మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని మెటా వర్గాలు చెబుతున్నాయి. కొత్త ఫీచర్లలో ఇన్‌స్టాగ్రామ్ ప్లస్‌లో స్పెషల్ ప్రొఫైల్ థీమ్‌లు, కస్టమ్ ఫాంట్లు, స్టోరీ కంట్రోల్ ఫీచర్లు, లోతైన అనలిటిక్స్ అందుబాటులోకి రావొచ్చని తెలుస్తోంది. అలాగే స్టోరీలను ఎక్కువ సమయం డిస్ ప్లే చేయడం, స్టోరీ వ్యూయర్లను సెర్చ్ చేయడం వంటి ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.
ఫేస్‌బుక్ ప్లస్‌లో ప్రొఫైల్ డిజైన్ ఆప్షన్లు, మెరుగైన ఎంగేజ్‌మెంట్ టూల్స్, ఆడియన్స్ ఎనలైజేషన్ వంటి కొత్త ఫీచర్లు అందించనున్నట్లు తెలుస్తోంది. ఇక వాట్సాప్ ప్లస్‌లో కస్టమ్ చాట్ థీమ్‌లు, యానిమేటెడ్ స్టిక్కర్లు, స్పెష్ నోటిఫికేషన్ సౌండ్స్, ఎక్కువ చాట్‌లను పిన్ చేసుకునే ఫీచర్లు అందుబాటులోకి రావచ్చని రిపోర్టులు చెబుతున్నాయి.
అయితే ఈ సబ్‌స్క్రిప్షన్ సేవలపై మెటా ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయన్న దానిపై కూడా స్పష్టత రాలేదు. అవన్నీతెలియాంటే వేచి చూడాల్సిందే.
