పార్క్ చేసిన కారులో శవంగా కనిపించిన ఇన్ స్టాగ్రాం సెలబ్రెటీ.. ఎవరీ కమల్ కౌర్ ?

పార్క్ చేసిన కారులో శవంగా కనిపించిన ఇన్ స్టాగ్రాం సెలబ్రెటీ.. ఎవరీ కమల్ కౌర్ ?

ఇన్ స్టాగ్రాంలో ఆమె ఓ సెలబ్రెటీ. హాట్ హాట్ ఫొటోలతో, అందచందాలను వెదజల్లుతూ వీడియోలు చేస్తుంటుంది. ఆమెకు ఇన్ స్టాగ్రాంలో దాదాపు 4 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు గానీ.. బుధవారం రాత్రి పంజాబ్లో పార్క్ చేసిన కారులో ఆమె శవమై కనిపించింది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కమల్ కౌర్ జీవితం ఇలా అర్థాంతరంగా ముగిసిపోయింది. పంజాబ్లోని భటిండా ప్రాంతంలో ఒక ప్రైవేట్ యూనివర్సిటీ సమీపంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

కౌర్ ఇటీవల పోస్ట్ చేసిన కొన్ని వీడియోలు, రీల్స్ వివాదానికి దారితీశాయి. ఆమె ఉన్నట్టుండి ఇలా కారులో విగతజీవిగా కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమెను హత్య చేసి కారులో పడేశారా..? (లేక) కారు పార్క్ చేసుకుని.. డోర్స్ లాక్ చేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుందా..? అనే విషయం తెలియాల్సి ఉంది. ఆమె ఇటీవల బూతులు తిడుతూ కొన్ని వీడియోలు చేసింది. ఆదేశ్ మెడికల్ యూనివర్సిటీ దగ్గర ఆమె మృతదేహం కనిపించడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మాజీ రేడియో జాకీ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సిమ్రాన్ సింగ్ అనే 26 ఏళ్ళ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఢిల్లీలోని గుర్గావ్ ప్రాంతంలో గతేడాది కలకలం రేపిన సంగతి తెలిసిందే. జమ్మూకి చెందిన సిమ్రాన్ సింగ్ స్థానిక ప్రాంతంలోని సెక్టార్ 46లో ఓ అద్దె ఫ్లాట్‌ లో నివాసం ఉంటోంది. సిమ్రాన్ సింగ్ రేడియో జాకీగా పనిచేసేది. దీంతో వృత్తి రీత్యా గుర్గావ్లో ఉంటోంది.

Also Read : మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ ను చీల్చుకుంటూ పేలిపోయిన విమానం

సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్గా ఉంటూ అప్పుడప్పుడు తనకి సంబందించిన ఫోటోలు, వీడియోలు వంటివి షేర్ చెయ్యడమే కాకుండా లోకల్ యాడ్స్ వంటివి చేస్తూ బాగానే సంపాదిస్తోంది. సిమ్రాన్ తన గదిలో సీలింగ్ ఫ్యాన్కి ఉరేసుకుని మృతి చెందింది. ఇలా ఈ మధ్య ఇన్‌ఫ్లుయెన్సర్ మరణాలు తోటి ఇన్‌ఫ్లుయెన్సర్లలో ఆందోళనకు కారణమవుతున్నాయి.