ఇన్స్టాగ్రామ్ డౌన్..81 శాతం మంది అకౌంట్లు పనిచేయలేదు

ఇన్స్టాగ్రామ్ డౌన్..81 శాతం మంది అకౌంట్లు పనిచేయలేదు


ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్  వరల్డ్ వైడ్గా  డౌన్ అయింది. ఇన్ స్టా అకౌంట్లను యాక్సెస్ చేయడంలో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  దాదాపు 81% మంది వినియోగదారులకు తమ హ్యాండ్‌సెట్‌లలో ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు ఇబ్బందులు తలెత్తాయి. 15% మంది కంటెంట్ పోస్ట్ చేయడంలోసమస్యలను ఎదుర్కొన్నారు . మరో 5% మంది యూజర్లకు ఇన్ స్టా లాగిన్ అవ్వలేదు. అటు 2021లోనూ ఇన్​స్టాగ్రామ్ ఒకసారి  డౌన్ అయింది. 

డౌన్ డిటెక్టర్ ప్రకారం అమెరికాలో 46,000 కంటే ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రామ్ యాక్సెస్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. యూకేలో 2,000 మంది వినియోగదారులు,  భారత్, ఆస్ట్రేలియా నుంచి 1000 కంటే ఎక్కువ మంది ఇన్ స్టాగ్రామ్ పై  ఫిర్యాదులు చేశారు. ఇన్ స్టా గ్రామ్ డౌన్ కావడంతో ఎంతో మంది యూజర్ల అకౌంట్లు సస్పెండ్ అయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి ఇన్ స్టా డౌన్ అయినట్లు డౌన్ డిటెక్టర్ అవుటేజ్ గ్రాఫ్ లో కనిపించింది.  అయితే  ఈ సమస్య 50 శాతం సర్వర్ కనెక్షన్లతో ముడిపడి ఉన్నట్లు ఇన్ స్టా సంస్థ తెలిపింది. మరో 20 శాతం మాత్రమే లాగిన్ సమస్యలు ఎదుర్కొన్నట్లు పేర్కొంది.