
ఇంటెలిజెన్స్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్), చెన్నై అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 11.
పోస్టుల సంఖ్య: 1010
పోస్టులు: ప్రెషర్ 320, కార్పెంటర్ 40, ఎలక్ట్రీషియన్ 40, ఫిట్టర్ 80, మెషినిస్ట్ 40, పెయింటర్ 40, వెల్డర్ 80, ఎంఎల్టీ–రేడియాలజీ 5, ఎంఎల్టీ– పాథాలజీ5, ఎక్స్–ఐటీఐ (670) కార్పెంటర్ 50, ఎలక్ట్రీషియన్ 160, ఫిట్టర్ 180, మెషినిస్ట్ 50, పెయింటర్ 50, వెల్డర్ 180, పీఏఎస్ఏఏ– ఎక్స్ఐటీ10.
ఎలిజిబిలిటీ: పదోతరగతి/ మెట్రిక్యుటేషన్/ ఎస్ఎస్ఎల్ సీ, 12వ తరగతి, ఎక్స్ ఐటీఐ అభ్యర్థులు మాత్రమే అర్హులు. డిగ్రీ, డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు కోర్సు పూర్తిచేసిన యాక్ట్ అంప్రెంటీసులు అర్హులు కాదు. ఎంఎల్ టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
వయోపరిమితి: 15 ఏండ్ల నుంచి 24 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: ఆగస్టు 11.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతర అభ్యర్థులకు రూ.100.
సెలెక్షన్ ప్రాసెస్: పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.