బీజేపీలోకి వెళ్లేది ఎవరు?.. జిల్లాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్లపై నిఘా

బీజేపీలోకి వెళ్లేది ఎవరు?.. జిల్లాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్లపై నిఘా
  • జిల్లాల్లో టీఆర్ఎస్ , కాంగ్రెస్ లీడర్లపై ఇంటెలిజెన్స్ నిఘా
  • సెకండ్ క్యాడర్ తో రెండురోజులుగా ఆరా
  • త్వరలో ఎలక్షన్స్ జరగనున్న చోట్ల స్పెషల్ ఫోకస్

జగిత్యాల, వెలుగుదుబ్బాక బై ఎలక్షన్స్​లో గెలిచిన బీజేపీ, జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకోవడంతో అధికార టీఆర్​ఎస్​ పార్టీకి వలసల భయం పట్టుకున్నది. టీఆర్​ఎస్​, కాంగ్రెస్​నుంచి పెద్దసంఖ్యలో లీడర్లు బీజేపీలోకి జంప్​ అయ్యే చాన్స్​ ఉందని అనుమానిస్తున్న ప్రభుత్వ పెద్దలు జిల్లాల్లో ఇంటెలిజెన్స్ వర్గాలను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. స్టేట్​వైడ్​ ఏయే లీడర్లు కాషాయ పార్టీలోకి వెళ్లే చాన్స్​ ఉందో వివరాలు సేకరించి రిపోర్ట్​ పంపుతున్నట్లు పోలీస్​వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ప్రతి లీడర్​ రిపోర్ట్​ కావాలట!

రాష్ట్ర వ్యాప్తంగా శనివారమే రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్​ వర్గాలు టీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన లీడర్ల​ గురించి ఆరా తీస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. గ్రామ సర్పంచ్​ మొదలుకొని మంత్రుల వరకు ఎవ్వరినీ వదలట్లేదు. రాజకీయంగా ప్రస్తుత పరిస్థితి, ఇప్పుడున్న పార్టీపై ఏ తరహా అసంతృప్తి ఉంది? పార్టీ మారడానికి ఇతరత్రా ఏయేఅంశాలు కారణమవుతున్నాయో తెలుసుకుంటున్నారు. ప్రధానంగా ఆయా లీడర్లకు బీజేపీ నేతలతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? వాళ్ల అనుచర గణం ఏస్థాయిలో ఉంది?​ ఎంత మంది ఓటర్లను ప్రభావితం చేయగలిగే చాన్స్​ఉందో ప్రత్యేకంగా కనుక్కొంటున్నారు. గ్రామాలు, పట్టణాల్లో సెకండ్​ కేడర్​ లీడర్లు, వివిధ సంఘాల నాయకుల నుంచి డాటా సేకరిస్తున్నారు.

సొంత పార్టీ లీడర్లపైనే ఎక్కువ ఫోకస్​

పై నుంచి వచ్చిన ఆదేశాలమేరకు ఇంటెలిజెన్స్​వర్గాలు ప్రధానంగా టీఆర్​ఎస్​ లీడర్లపైనే ఫోకస్​ పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహా వివిధ టికెట్లు ఆశించి భంగపడినవారు, కాంగ్రెస్​ నుంచి ఎమ్మెల్యేలు వలస వచ్చిన చోట వాళ్లతో అంటీముట్టనట్లు ఉంటున్న టీఆర్​ఎస్​ లీడర్లు బీజేపీలోకి వెళ్లే చాన్స్​ ఉందని ప్రభుత్వ పెద్దలు అనుమానిస్తున్నారు. దీంతో ఒక వర్గం నేతలకు తెలియకుండా మరో వర్గం నేతలను ఆరా తీస్తున్నారు. ప్రధానంగా సెకండ్​క్యాడర్​ చెప్పే విషయాలను ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకొని నివేదికల్లో పొందుపరుస్తున్నారు.

సాగర్, వరంగల్, ఖమ్మంపై నజర్​

ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఖాళీ అయిన నాగార్జునసాగర్​ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు వరంగల్​, ఖమ్మం కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భంగపడ్డ రూలింగ్​ పార్టీ ఆ మూడుచోట్ల నుంచి స్పెషల్​ రిపోర్టులు తెప్పించుకుంటోంది. ఇంటెలిజెన్స్​తో పాటు థర్డ్​పార్టీ తో ఎంక్వైరీ చేయిస్తోంది. టీఆర్​ఎస్​తో పాటు బీజేపీ, ఇతర పార్టీల బలాబలాలు, రెండు బల్దియాల పరిధిలో సిట్టింగులపై ఉన్న వ్యతిరేకత గురించి ఆరా తీస్తోంది.

ఇకపై నిరంతర నిఘా..

అధికారపార్టీలో మండలస్థాయి లీడర్​మొదలుకొని మంత్రి వరకు ఇకపై నిరంతర నిఘా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. అధికారపార్టీ నేతలే ఈ విషయమై చర్చించుకుంటున్నారు.  నియోజకవర్గాలవారీగా టీఆర్ఎస్ పరిస్థితి, ప్రభుత్వ  పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారో ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని ప్రగతి భవన్ నుంచే ఆదేశాలు వచ్చాయని అంటున్నారు. ఈక్రమంలో  ఫోన్​లో ఎవరితో మాట్లాడాలన్నా భయమేస్తోందని, తమ అనుచరులతోనూ స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నామని, కొంతకాలం ఈ పరిస్థితి తప్పేలా లేదని టీఆర్​ఎస్​ లీడర్లు చెప్పుకుంటున్నారు.