ఇంటర్ సప్లిమెంటరీకి 4.12 లక్షలమంది .. మే 22 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు

ఇంటర్ సప్లిమెంటరీకి 4.12 లక్షలమంది .. మే 22 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షలు రాసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 4,12,724 మంది ఫీజు చెల్లించారు. అపరాద రుసుము లేకుండా 4,08,339 మంది చెల్లించగా, వెయ్యి ఫైన్​తో 4,385 మంది దరఖాస్తు చేసుకున్నారు. 

కాగా, ఫస్టియర్ జనరల్ స్టూడెంట్లు 2,49,032 మంది, ఒకేషనల్ స్టూడెంట్లు 16,994 మంది ఫీజు చెల్లించగా, సెకండియర్ జనరల్ స్టూడెంట్లు 1,34,341 మంది, ఒకేషనల్ విద్యార్థులు 12,357 మంది ఫీజు కట్టినట్టు అధికారులు చెప్పారు.