జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు

జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు

ఏప్రిల్ 1 నుంచి మే31 వరకు అన్ని జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు వేసవి సెలవులు ప్రకటించింది. జూన్ 1వ తేదీన కాలేజీలు  తిరిగి ప్రారంభం అవుతాయని వెల్లడించింది.  ఇంటర్ బోర్డు ఇచ్చిన అదేశాలు పాటించని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న బోర్డు అధికారులు హెచ్చరించారు. 

2023-24 జూనియర్ కాలేజీల వర్కింగ్ డే నెల వారిగా క్యాలెండర్ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. 2023-24 లో మొత్తం 304 రోజులకు గాను 227 జూనియర్ కాలేజీల వర్కింగ్ డేస్ ఉంటాయని తెలిపింది. 2023-24 లో ఆదివారాలు, పండగల సెలవులు మొత్తం కలిపి 77 రోజులు ఉన్నాయని పేర్కొంది. బోర్డు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే అడ్మిషన్లు తీసుకోవాలని.. నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు తీసుకుంటే కాలేజీల పై  చర్యలు తప్పవన్న బోర్డు అధికారులు హెచ్చరించారు.