ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫీజులు వెనక్కి

ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫీజులు వెనక్కి

తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్  ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు  మినిమమ్ మార్కులు వేసి పాస్ చేసినట్లు  ఇంటర్ బోర్టు సెక్రటరీ ఒమర్ జలీల్ తెలిపారు. విద్యార్ధులు బోర్టు వెబ్ సైట్  ద్వారా రేపటి (శుక్రవారం) నుంచి మెమోలు చేసుకోవచ్చని తెలిపారు.  సాయంత్రం  5 గంటల నుండి  ఇంటర్ బోర్డు వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in మార్కుల మెమోలు అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు.

అక్టోబర్ 2021లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫెయిల్ అయిన విద్యార్ధులు రీవెరిఫికేషన్ ,రీకౌంటింగ్ కోసం చెల్లించిన ఫీజును వెనక్కి తీసుకునే అవకాశముందని తెలిపారు ఇంటర్ బోర్టు సెక్రటరీ ఒమర్ జలీల్. రేపు (శుక్రవారం) సాయంత్రం 5 గంటల నుంచి ఈ నెల 17 వరకు రీవెరిఫికేషన్ ,రీకౌంటింగ్ కోసం చేసుకొన్న దరఖాస్తును రద్దు చేసుకోవచ్చన్నారు. అంతేకాదు .. చెల్లించిన ఫీజును ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ నుంచి మొత్తాన్ని తీసుకోవాలని విద్యార్ధులకు సూచించారు.