అసమానతలు రూపుమాపేది విద్య ఒక్కటే : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

అసమానతలు రూపుమాపేది విద్య ఒక్కటే : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • లయోలా విద్యాసంస్థల 
  • గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ప్రసంగం

అల్వాల్, వెలుగు: సమాజంలో పాతుకుపోయిన అసమానతలను రూపుమాపడానికి ప్రధాన ఆయుధం విద్య మాత్రమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నైపుణ్యంతో పాటు మానవ విలువలు కలిగిన విద్య అందించడమే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా భారత్ ఫీచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయని, రాష్ట్రంలోని 100 ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని తెలిపారు.

ఇవి యువతకు ఉపాధితో పాటు రాష్ట్ర జీడీపీ పెరుగుదలకు ఉపయోగపడతాయన్నారు. శనివారం అల్వాల్​లోని లయోలా విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ వేడుకలకు డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలో వ్యవస్థలు, సంస్థల్లో మార్పు విద్య ద్వారానే సాధ్యమని, సిపెక్ సర్వే ద్వారా ఇది మరింత స్పష్టమైందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు.