ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు

ఇంటర్మీడియట్‌ సెకండ్ ఇయర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఏడాది కాలం కష్టపడి చదివిన చదువులకు ముగింపు పలకడంతో విద్యార్థులు  ఆనందంలో మునిగి తేలారు. చివరి పరీక్ష పూర్తి కావడంతో విద్యార్థులు కేరింతలతో ఇంటికి పయనమయ్యారు. గత రెండు నెలలుగా రాత్రి పగలు కష్టపడి చదువుకుని పరీక్షలు రాశామని విద్యార్థులు తెలిపారు.  

 ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ప్రభుత్వం పకడ్బందీగా పరీక్షలను నిర్వహించిందని బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర తెలిపారు. ప్రశాంత వాతావరణంలో  పరీక్షలు ముగియడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఊపిరిపించుకున్నారని అన్నారు.  బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ లో పరీక్షా కేంద్రాలను కమిషనర్ శరత్ చంద్ర సందర్శించారు. 

మొదటి, రెండో సంవత్సరాలకు కలిపి 9 లక్షల 80 వేల 978 మంది పరీక్ష రాయడానికి హాల్ టికెట్లు పొందారు. మొదటి సంవత్సరంలో 4లక్షల 78వేల 718 మందిఉండగా రెండో సంవత్సరంలో 5 లక్షల 2 వేల 260 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,521 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని అధికారులు తెలిపారు.