
సికింద్రాబాద్, వెలుగు: రైళ్లలో గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. రూ.4.5లక్షల విలువ చేసే 18 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రైల్వే అర్బన్ డీఎస్సీ జావేద్, సికింద్రాబాద్ జీఆర్పీ ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్ వివరాలు వెల్లడించారు. వెస్ట్ బెంగాల్ లోని హుగ్లీకి చెందిన ప్రీతమ్చౌదరి(37), సత్యంచౌదరి(29) అన్నాదమ్ములు. ఈజీ మనీ సంపాదించాలనే ఆశతో ఈనెల 25న వెస్ట్‌బెంగాల్‌లోని షాలీమార్ టౌన్‌కు వెళ్లారు. అక్కడ రూ.10వేలతో 18 కిలోల గంజాయి కొని షాలీమార్ నుంచి సికింద్రాబాద్ మీదుగా ముంబైకి తరలించేందుకు ప్లాన్ వేశారు. షాలీమార్‌లో రైలెక్కి మంగళవారం సికింద్రాబాద్ లో దిగారు. అక్కడ ముంబై వెళ్లే రైలు కోసం వేచి ఉండగా జీఆర్ పీ, ఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారు. 18కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గంజాయివిలువ రూ.4.50లక్షలుంటుందని డీఎస్సీ జావేద్ తెలిపారు.