పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగ : కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర

పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగ : కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర

కామారెడ్డి, వెలుగు: తెలంగాణ, ఏపీలో చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఎస్పీ రాజేశ్​చంద్ర సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. కరీంనగర్​ అశోక్​నగర్​ కాలనీకి చెందిన ఠాకూర్​ జగన్​సింగ్​ అలియాస్​​దినేశ్​సింగ్​ అలియాస్​ డీజే డానీ, అలియాస్​ దినేశ్​రాజ్​ పురోహిత్​ గత నెల 11న కామారెడ్డిలోని శ్రీసాయి రెసిడెన్సీ అపార్ట్​మెంట్​లో ఉండే అడ్డగుల బాలకృష్ణ ఇంట్లో 33 తులాల బంగారం, 10 కిలోల వెండి నగలు దొంగిలించాడు. 

సీసీ పుటేజీ, టెక్నికల్  ఆధారాలతో నేరస్తుడిని గుర్తించిన పోలీసులు ముంబాయికి ప్రైవేట్  ట్రావెల్స్​ బస్సులో వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై తెలంగాణ, ఏపీలోని వివిధ పోలీస్​ స్టేషన్లలో 32 దొంగతనం కేసులు నమోదయ్యాయని ఎస్పీ వివరించారు. అతని నుంచి రూ.42.50 లక్షల విలువైన 14.5 తులాల బంగారం, 5.7 కిలోల వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ మదుసూధన్​, సీఐలు నరహరి, రామన్​ ఉన్నారు.