
ఎల్బీనగర్, వెలుగు: మొబైల్గేమ్స్ఎక్కువగా ఆడొద్దని పేరెంట్స్ మందలించడంతో ఓ ఇంటర్ స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది. మీర్‌పేట్ సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మీర్పేట్సర్వోదయ నగర్ కాలనీలో ఉండే కౌశికి(17) ఇంటర్మీడియెట్చదువుతోంది. ఆదివారం రాత్రి ఫోన్‌లో గేమ్స్ ఆడుతుండగా ఆమె తండ్రి మందలించాడు. దాంతో మనస్తాపానికి గురైన కౌశికి తన గదిలోకి వెళ్లి ఉరివేసుకుంది. గదిలోకి వెళ్లిన కొద్దిసేపటికి తలుపు తీయకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు కిటికీ అద్దాలు పగలగొట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.