
- 18,837 స్టూడెంట్స్ కోసం 36 సెంటర్లు
- అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్
నిజామాబాద్, వెలుగు: ఈ నెల 22 నుంచి 27 దాకా జరిగే ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌కు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ సూచించారు. గురువారం ఆయన తన చాంబర్లో ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. మొత్తం 18,837 స్టూడెంట్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాయనుండగా 36 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం12 వరకు, సెకండ్ఇయర్ పరీక్షలు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 5.30 దాకా నిర్వహిస్తామన్నారు. ఎగ్జామ్ టైంకు ఆర్టీసీ బస్సులు నడిచేలా చూడాలని, పరీక్ష సెంటర్లలో కరెంట్ సరఫరాకు ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
తాగునీటి వసతి కల్పించాలని, మరుగుదొడ్లు క్లీన్‌గా పెట్టాలన్నారు. తగిన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఆన్సర్ షీట్స్ భద్రంచేసే బాధ్యత పోస్టల్ శాఖవారిదేనన్నారు. సెంటర్ల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో పెట్టాలని, ఏఎన్ఎం, ఆశా వర్కర్స్‌ను అందుబాటులో పెట్టాలన్నారు. డీవీఈవో రవికుమార్, అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి, ఎగ్జామ్ నిర్వాహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, కనక మహాలక్ష్మీ తదితరులు
ఉన్నారు.