జులై ఫస్ట్ వీక్​లో ఇంటర్ అడ్వాన్స్​డ్ రిజల్ట్​!

జులై ఫస్ట్ వీక్​లో ఇంటర్ అడ్వాన్స్​డ్ రిజల్ట్​!

రేపటి నుంచి స్పాట్ వాల్యుయేషన్ 

హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల మొదటి వారంలో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్​ డ్ ఫలితాలు ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఈ నెల 21 నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభిస్తోంది. ఈ నెల12 నుంచి ఇంటర్ అడ్వాన్స్​ డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కాగా, శనివారంతో మెయిన్ సబ్జెక్టుల ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. మంగళవారంతో మైనర్ మీడియా పరీక్షలూ పూర్తికానున్నాయి. ఈ పరీక్షలను ఫస్టియర్ విద్యార్థులు 2,70,583, సెకండియర్ స్టూడెంట్లు 1,41,742 మంది రాశారు. పరీక్షలు పూర్తవుతుండడంతో ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ పై ఇంటర్ బోర్డు అధికారులు దృష్టి సారించారు. రాష్ట్రంలోని 15 కేంద్రాల్లో స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం కానుంది. వాల్యుయేషన్ ను వారం రోజుల్లో పూర్తి చేసి, జులై ఫస్ట్ వీక్​లో ఫలితాలు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.