
జూన్ 1న రీ ఓపెన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్నిజూనియర్ కాలేజీలకు ఈనెల 30 నుంచిమే31 వరకు ఇంటర్ బోర్డు వేసవి సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీలన్నింటికీ సెలవులు వర్తిస్తాయని సోమవారం ఓ ప్రకనటలో పేర్కొంది. 2019–-20 విద్యా సంవత్సరం జూన్ 1 నుంచి ప్రారంభమవుతుందని బోర్డు సెక్రెటరీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.