ఇయ్యాల్టి నుంచే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు

 ఇయ్యాల్టి నుంచే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
  • నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ 
  • మొత్తం స్టూడెంట్లు 4,59,228 
  • జనరల్: 4,09,897 
  • ఒకేషనల్: 49,331

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్లకు ఫస్టియర్ ఎగ్జామ్స్ సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి వచ్చే నెల 3 వరకు కొనసాగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయి.  గంట ముందే స్టూడెంట్లను సెంటర్లలోకి అనుమతిస్తారు. ఈ ఏడాది కూడా నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని, ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించబోమని అధికారులు చెప్పారు. హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్ నుంచి డౌన్​లోడ్ చేసుకొని, డైరెక్టుగా ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హాజరు కావొచ్చని తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ నెల 29,30 తేదీల్లో జరగాల్సిన ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు వాయిదా పడ్డాయి. 29న జరగాల్సిన ఫిజిక్స్, ఎకనామిక్స్ 31న.. 30న జరగాల్సిన కెమిస్ర్టీ, కామర్స్ పరీక్షలు నవంబర్ 1న జరుగుతాయి. 
ప్రతి సెంటర్ లో సీసీ కెమెరాలు.. 
రాష్ట్రవ్యాప్తంగా 4,59,228 మంది పరీక్షలకు హాజరు కానుండగా.. వారి కోసం 1,768 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 25,258 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల్లేని సెంటర్లుంటే.. ఒక్కరోజు కోసం వాటిని రెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకొని ఆయా సెంటర్లలో పెట్టారు. క్వశ్చన్ పేపర్లు ఓపెన్ చేసేటప్పుడు, ఆన్సర్ షీట్లు ప్యాక్ చేసేటప్పుడు కనిపించే విధంగా వీటిని అమర్చారు. సెంటర్ ఎంట్రెన్స్​లోనూ ఓ కెమెరాను పెట్టారు. పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేందుకు రాష్ట్రంలో70 ఫ్లయింగ్ స్క్వాడ్ ,125 సిట్టింగ్ స్క్వాడ్ టీమ్స్ ను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. సెంటర్లకు వచ్చే స్టూడెంట్లకు థర్మల్ స్క్రీనింగ్ చేయించి.. ఎక్కువ టెంపరేచర్ ఉంటే ప్రత్యేక రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎగ్జామ్ రాయించనున్నారు. రెండు డోసుల టీకా వేసుకున్న వారికే ఎగ్జామ్ డ్యూటీలు వేసినట్లు అధికారులు చెప్పారు.