Cricket Schedule: క్రికెట్ లవర్స్‌కు పండగే.. నేడు నాలుగు అంతర్జాతీయ మ్యాచ్‌లు

Cricket Schedule: క్రికెట్ లవర్స్‌కు పండగే.. నేడు నాలుగు అంతర్జాతీయ మ్యాచ్‌లు

క్రికెట్ లవర్స్ కు సోమవారం (అక్టోబర్ 20) పండగే. నేడు ఒక్క రోజు ఏకంగా నాలుగు అంతర్జాతీయ మ్యాచ్ లు జరగనున్నాయి. అన్ని దేశాలు నేడు మ్యాచ్ లతో బిజీగా మారనున్నాయి. ఈ వారంలో శ్రీలంక తప్పితే అన్ని దేశాలు క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు మహిళల వరల్డ్ కప్ కూడా జరుగుతుంది. పాకిస్థాన్, సౌతాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్ట్ సోమవారం (అక్టోబర్ 20) ప్రారంభమైంది. రావల్పిండి వేదికగా జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ లో పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేస్తోంది. ప్రస్తుతం 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. 

ఇంగ్లాండ్, న్యూజిలాండ్ రెండో టీ20:

మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు క్రైస్ట్ చర్చ్ లో రెండో టీ20 ఆడుతున్నాయి. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. సాల్ట్ 85 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. 

శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య నాకౌట్ మ్యాచ్:

మహిళల వరల్డ్ కప్ లో భాగంగా సోమవారం (అక్టోబర్ 20) శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. గెలిచిన జట్టు సెమీస్ రేస్ లో ఉంటుంది. పాకిస్థాన్, శ్రీలంక రెండు జట్లు కూడా ఐదు మ్యాచ్ ల్లో రెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్నాయి. 

జింబాబ్వే- ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఏకైక టెస్ట్:

జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఏకైక టెస్ట్ అక్టోబర్ 20 నుంచి ప్రారంభం కానుంది. రెండు జట్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగం కాకపోయినా టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. హరారే వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. సొంతగడ్డపై జింబాబ్వే ఈ మ్యాచ్ లో ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించి టెస్ట్ క్రికెట్ లో తమ ఉనికిని చాటుకోవాలని భావిస్తున్నాయి.