
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మరో షాక్ తగిలింది. అంతర్జాతీయ జూడో ఫెడరేషన్ గౌరవాధ్యక్షుడు, అంబాసిడర్‌గా ఉన్న పుతిన్‌ను ఆ బాధ్యతల సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో పుతిన్‌ను స్పోర్ట్స్ గవర్నింగ్ బాడీ తొలగించింది. "ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధ సంఘర్షణ నేపథ్యంలో, అంతర్జాతీయ జూడో ఫెడరేషన్ గౌరవాధ్యక్షుడు, అంబాసిడర్‌గా వ్లాదిమిర్ పుతిన్ హోదాను నిలిపివేస్తున్నట్లు ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్ ప్రకటించింది.
డాన్‌బాస్ ప్రాంతంలోని ప్రజలను "రక్షించడానికి" అంటూ ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు ప్రత్యేక సైనిక కార్యకలాపాలను ఆదేశించారు.
అంతకుముందు, పుతిన్ ఉక్రెయిన్ నుంచి విడిపోయిన ప్రాంతాలు - డోనెట్స్క్, లుహాన్స్క్ - స్వతంత్ర సంస్థలుగా గుర్తించారు.
రష్యా ఇటీవలి చర్యలపై పాశ్చాత్య దేశాల నుండి విపరీతమైన విమర్శలను ఎదుర్కొంటోంది. యుఎస్, యుకె, జర్మనీతో సహా అనేక దేశాలు రష్యాపై తాజాగా ఆంక్షలను అమలు చేశాయి.
International Judo Federation suspends Vladimir Putin as its honorary president amid 'ongoing war conflict in Ukraine'
— ANI Digital (@ani_digital) February 27, 2022
Read @ANI Story | https://t.co/DaKtzfSgqY#Ukraine #UkraineRussia #UkraineCrisis #UkraineRussiaCrisis pic.twitter.com/dcqmpb0MfC
ఇవి కూడా చదవండి: