భారతీయులందరినీ సురక్షితంగా తీసుకొస్తం 

భారతీయులందరినీ సురక్షితంగా తీసుకొస్తం 

ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులందరినీ వీలైనంత తొందరగా స్వదేశానికి తీసుకొస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. వారందరినీ సురక్షితంగా తీసుకువచ్చేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. ఇందుకయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ పొరుగున ఉన్న దేశాలకు ఫ్లైట్ల సంఖ్య పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ అంశంపై ఆయా దేశాలతో చర్చిస్తున్నట్లు ప్రకటించారు.

ఉక్రెయిన్లో రష్యా దాడులపై స్పందించిన రాజ్నాథ్.. భారత్ ప్రపంచ శాంతి కోరుకుంటోందని చెప్పారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ వ్యవహరిస్తున్న తీరు ప్రశంసనీయమని అన్నారు. భారత్ ఇప్పటి వరకు ఏ దేశంపైనా దాడులకు పాల్పడలేదని, ఎవరి భూభాగాన్ని ఆక్రమించుకోలేదని చెప్పారు. పాకిస్థాన్పై సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం ప్రపంచ దృష్టిలో భారత్పై ఉన్న అభిప్రాయం మారిపోయిందని రాజ్నాథ్ అభిప్రాయపడ్డారు.