నర్సుల సేవలు వెలకట్టలేనివి : ఇందిరా శోభన్

నర్సుల సేవలు వెలకట్టలేనివి : ఇందిరా శోభన్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ నర్సస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నర్సుల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలను వివరించారు. కొత్త నర్సులు నియామకాలు, జిల్లాల్లో కొత్త నర్సింగ్ కాలేజీల ఏర్పాటు, నిమ్స్​ లో యూనిఫాం డ్రెస్ కోడ్ ఆధునీకరణ, ప్రమోషన్లు, జనరల్ ట్రాన్స్‌ఫర్లను ప్రభుత్వం చేపట్టిందని వివరించారు.

టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్, నిర్మలా జగ్గారెడ్డి, భాషా సాంస్కృతిక డైరెక్టర్ మామిడి హరికృష్ణ, విద్యులత (నర్సింగ్ డీడీ), విజయ నిర్మల (ఏడీ), విద్యావతి (నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్), అసోసియేషన్ అధ్యక్షురాలు ఆదిలక్ష్మి, ప్రధాన కార్యదర్శి లలిత, కోశాధికారి స్వర్ణలత, రాష్ట్ర కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో నర్సింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

పద్మారావునగర్: వైద్య రంగంలో నర్సుల సేవలు వెలకట్టలేనివని సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్​ డాక్టర్ రాజకుమారి కొనియాడారు. హాస్పిటల్​లో ఫ్లోరెన్స్ నైటింగేల్ ఫొటో ముందు క్యాండిల్స్ వెలిగించి నివాళులర్పించారు. ఆమె జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో నర్సింగ్​ సిబ్బంది చేస్తున్న విశేష సేవలను అభినందించారు. నర్సింగ్ సూపరింటెండెంట్ లు మేరిస్​ స్టెల్లా, విద్యావతి, సిబ్బంది సుజాత శ్యామల, సుభాషిని, సరిత, కవిత పాల్గొన్నారు.

అపోలోలో ఆడిపాడిన నర్సులు

అపోలో హాస్పిటల్స్​ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్​అపోలోలో కేర్​చాంపియన్స్​ పేరిట పలు కార్యక్రమాలునిర్వహించారు. ఇందులో భాగంగా గ్రాటిట్యూడ్ ​వాల్ ​ఏర్పాటు చేయగా, చికిత్స పొందుతున్న పేషెంట్లు, వారి బంధువులు, స్టాఫ్​నర్సుల సేవను పొగుడుతూ గోడపై కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పలువురు నర్సులు ఆడి పాడారు.