ఇఫ్లూలో ఇంటర్నేషనల్ సెమినార్

ఇఫ్లూలో ఇంటర్నేషనల్ సెమినార్

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఏఐ, ఎడ్యుకేషనల్​కమ్యూనికేషన్​అండ్ మీడియా ట్రాన్స్ ఫర్మేషన్ అంశాలపై ఇఫ్లూలో నవంబరు 28 నుంచి మూడు రోజుల పాటు ఇంటర్నేషనల్ సెమినార్ నిర్వహించనున్నట్లు ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్ (ఈఎంఆర్​సీ)​డైరెక్టర్ ప్రొఫెసర్​టీటీ శ్రీకుమార్​ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈఎంఆర్సీ, సీఈసీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సెమినార్​లో  ప్రపంచంలోని వివిధ రంగాల నిపుణులు, స్కాలర్స్, విద్యావేత్తలు పాల్గొని ప్రసంగించనున్నట్లు తెలిపారు. 

ఏఐ, విద్యారంగంపై డిజిటల్​టెక్నాలజీ అండ్​ కమ్యూనికేషన్ ప్రభావం, ఇన్నోవేషన్స్​పై చర్చల్లో పాల్గొనే వారు తమ వివరాలను ఈ నెల 25 లోపు అందజేయాలన్నారు. అలాగే నవంబరు 5 వరకు నోటిఫికేషన్​ను అంగీకరిస్తున్నట్టు, నవంబరు 15 నాటికి పేపర్ సబ్మిట్ చేయాలన్నారు. పూర్తి వివరాలకు at director.emmrc@efluniversity.ac.in. సంప్రదించాలని కోరారు.