ఐజ్వాల్లో ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ : కిషన్ రెడ్డి

ఐజ్వాల్లో ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ : కిషన్ రెడ్డి

మిజోరాం రాజధాని ఐజ్వాల్లో ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ను నిర్వహిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల పర్యాటక సామర్థ్యం దేశానికి తెలియాల్సివుందని.. టూరిజం మార్కెట్ను ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వంలో ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక వసతుల కల్పనకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు. 

మౌలిక వసతుల్లేకుండా పర్యాటక ఆభివృద్ధి సాధ్యం కాదని కిషన్ రెడ్డి అన్నారు. ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ పర్యాటక రంగ ప్రాధాన్యతలను ప్రదర్శిస్తుందని తెలిపారు. అదేవిధంగా జీ20 టూరిజం టాస్క్ ను కూడా నిర్వహించబోతుందన్నారు. వచ్చే ఏడాది నుంచి భారత్ జీ20కి నేతృత్వం వహించనుందని..ఇందులో ఒక కీలక మీటింగ్ ఐజ్వాల్ లో నిర్వహించనున్నట్లు తెలిపారు. 

నార్త్ ఈస్ట్ స్టేట్స్కు స్వదేశీ దర్శన్లో భాగంగా 1337 కోట్ల అందించామని కిషన్ రెడ్డి తెలిపారు.ఈశాన్యంలో శాంతి నెలకొంటుందని.. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఈ దిశగా ప్రత్యేకమైన చొరవతీసుకుంటున్నాయని చెప్పారు.అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో రైలు కనెక్టివిటీ పూర్తయిందన్నారు. జాతీయ రహదారుల కోసం ఇప్పటి వరకు 52వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.