ముషీరాబాద్, వెలుగు : బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఇనిస్టిట్యూట్, తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఇంటర్నేషనల్ యూత్ డే నిర్వహించారు. అంబేద్కర్ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ స్టూడెంట్లు ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. వివిధ కాలేజీలకు చెందిన స్టూడెంట్లు పాల్గొన్నారు. స్టేట్ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డిప్యూటీ డైరెక్టర్ రవికుమార్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
అనంతరం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సదస్సులో స్టూడెంట్లు పాల్గొన్నారు. ప్రాజెక్టు డైరెక్టర్ హైమావతి మాట్లాడుతూ.. హెచ్ఐవీపై అవగాహన కల్పించారు. యువతలో మార్పుతో సమాజాన్ని బాగుచేయొచ్చన్నారు. అంబేద్కర్ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ఆఫీసర్ డాక్టర్.శ్రీధర్, ఎన్.కుమారస్వామి, విమెన్స్ వింగ్ ఎన్.సప్న, వలంటీర్లు పాల్గొన్నారు.
