తొర్రూరు, వెలుగు : విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఐఎన్ టీయూసీ, టీఎస్ ఈఈ -327 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇనుగాల శ్రీధర్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ఐఎన్టీయూసీ, టీఎస్ ఈఈ -327 యూనియన్ డివిజన్ సర్వసభ్య సమావేశం ఆ సంఘం డివిజన్ అధ్యక్షుడు ఎస్కే పాషా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ విద్యుత్ కార్మికులకు అండగా ఉంటామని, ఎన్పీడీసీఎల్ పరిధిలో అన్ మ్యాన్డ్ వర్కర్లకు జరిగిన అన్యాయాన్ని సీఎండీ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
కాగా, టీఆర్ వికేఎస్ యూనియన్ కు చెందిన 40 మంది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీధర్ సమక్షంలో ఐఎన్టీయూసీ యూనియన్ లో చేరారు. వారికి సభ్యత్వాలు అందజేశారు. అనంతరం పాలకేంద్రం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు నీలం ఐలేస్, సంఘం రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ధరావత్ సికిందర్, కంపెనీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, కంపెనీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి పాల్గొన్నారు.