గొర్రెల స్కాం కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇవాళ రెండవ రోజు నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోని విచారించనుంది. పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న డిప్యూటీ డైరెక్టర్స్ సంగు గణేష్, రఘుపతి రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ కేశవ సాయి, ధర్మపురి రవిలను నిందితులుగా చేర్చి విచారణ జరుపుతుంది. గురువారం రోజు సుధీర్ఘంగా 6 గంటలపాటు విచారించి కీలక ఆదారాలు సేకరించింది ఏసీబీ.
గొర్రెల స్కాంలో కేసులో రెండు కోట్ల నిధుల దారి మల్లింపు పై ఆరా తీసింది.స్కాం కేసులో అసలు సూత్రధారులు, పాత్రధారులపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ స్కాంలో పెద్ద పెద్ద వారు చాలా మంది ఉండొచ్చని ఏసీబీ అనుమానిస్తుంది.
