
న్యూఢిల్లీ: బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలకు ఎటువంటి ఇంట్రిన్సిక్ వాల్యూ (నిజమైన వాల్యూ) లేదని, వీటిలో ఇన్వెస్ట్ చేయడాన్ని గ్యాంబ్లింగ్‌లో చేసినట్టే రెగ్యులేట్ చేయాలని యూకే ట్రెజరీ సెలెక్ట్ కమిటీ అక్కడి ప్రభుత్వానికి రికమండ్ చేసింది. డిజిటల్ అసెట్స్‌ను ఎలా చూడాలనే అంశంపై నెల రోజులుగా ఎంక్వైరీ చేశాక కమిటీ ఈ రికమండేషన్స్ ఇచ్చింది. యూకే ప్రభుత్వం డిజిటల్ కరెన్సీలను గ్యాంబ్లింగ్‌లా చూస్తే మిగిలిన దేశాలు కూడా దీన్నే ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ సర్వీస్‌ల మాదిరి క్రిప్టో కరెన్సీలను రెగ్యులేట్ చేస్తే, వీటిలో ఇన్వెస్ట్ చేయడం సేఫ్ అని లేదా ప్రొటక్షన్ ఉంటుందని కన్జూమర్లు భావిస్తారు.
కానీ ఇవి సేఫ్ కావు’ అని రిపోర్ట్ పేర్కొంది. సుమారు 10% మంది యూకే అడల్ట్స్ దగ్గర క్రిప్టో కరెన్సీలు ఉన్నాయంది. ఈ రిపోర్ట్ వెలువడిన 2 నెలల లోపు ప్రభుత్వం ఈ రికమండేషన్స్‌పై నిర్ణయం తీసుకుంటుంది. కచ్చితంగా ఫాలో కావాలని లేదు. క్రిప్టో కరెన్సీలను స్పోర్ట్స్ బెట్టింగ్స్ లేదా కాసినోతో కమిటీ పోల్చడాన్ని చూస్తుంటే వీటికి ఎటువంటి వాల్యూ లేదని, ఎక్కువ వోలటాలిటీతో కదులుతాయని, సోషల్‌గా వీటి వల్ల ఉపయోగం లేదనే విషయం అర్థమవుతుంది.