యాప్లో పెట్టుబడి.. రూ.4 లక్షలు పోగొట్టుకున్న ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి

యాప్లో పెట్టుబడి.. రూ.4 లక్షలు పోగొట్టుకున్న ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి

కామారెడ్డి జిల్లా : సైబర్ క్రైమ్ ఉచ్చులో మరో యువకుడు చిక్కుకున్నాడు. యాప్ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలొస్తాయని నమ్మి ఏకంగా రూ.4 లక్షలు మోసపోయాడు. మోసపోయానని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా అశోక్ నగర్ కాలనీలో చోటుచేసుకుంది. 

సైబర్ క్రైమ్ దుండగులు కామారెడ్డి కి చెందిన ఓ యువకునికి యాప్స్ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ ఫోన్ చేసి నమ్మబలికించారు.  అదంతా నిజమేనని నమ్మిన యువకుడు దుండగులు పంపిన వివిధ లింకుల ద్వారా విడతలవారీగా మూడు నెలల వ్యవధిలో రూ. 4,000,00 ట్రాన్స్ ఫర్ చేశాడు. యాప్ లో పెట్టుబడి పెడుతున్నానని నమ్మి కొంతకాలం సైలెంట్ గా ఉన్నాడు. తర్వాత యాప్ లో ఇన్వెస్ట్ మెంట్ డబ్బు పెరిగిందాలేదా అని చెక్ చేసుకోగా ఎలాంటి లాభాలు రాకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. తర్వాత మోసపోయాననీ  గ్రహించిన బాధితుడు కామారెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు విచారణలో బాధిత యువకుడు ఎయిర్ ఫోర్స్ లో విధులు నిర్వహిస్తున్నాడని తెలిసింది. ఆ యువకుని నుంచి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.