హైదరాబాద్, వెలుగు : మార్చి10న హైదరాబాద్ లోని నాంపల్లి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జ్యోతిష్య పురస్కార వేడుక, సెమినార్ నిర్వహించనున్నట్లు ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో ప్రైవేట్ లిమిటెడ్, ఆర్యన్ ఆస్ట్రాలజీ రిసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకులు జ్యోతిష్య బ్రహ్మ డాక్టర్ నరసింహస్వామి తెలిపారు.
అర్హతలు, అనుభవం ఆధారంగా జ్యోతిష్య శిరోమణి, జ్యోతిష్య గురువు, జ్యోతిష్య భీష్మా, జ్యోతిష్య ఆచార్య తదితర అవార్డులు అందజేస్తామన్నారు. నామినేషన్లకు మంగళవారం చివరి తేదీ, వివరాలకు 9652475566 నంబర్ లో సంప్రదించాలని కోరారు. ఫిబ్రవరి 23న రాజమండ్రిలో జ్యోతిష్య సెమినార్ ఉందని, 9848911422 లో సంప్రదించాలని సూచించారు.
