
పాకిస్తాన్ లో IPL 2019 ప్రసారాలను నిలిపివేస్తున్నట్టు ఆదేశ సమాచార శాఖ మంత్రి ఫవాద్ అహ్మద్ చౌదరి తెలిపారు. పుల్వామా దాడి జరిగినపుడు భారత్ లో పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ లను బ్యాన్ చేసినందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. తమకు రాజకీయాలను, క్రీడలను వేరు వేరుగా చేడాలన్న విషయం తెలుసని అయితే..పుల్వామా విషయంలో.. భారత్ తమతో వ్యవహరించిన తీరు భాదాకరమని చెప్పారు.
పుల్వామా దాడిలో భారత 42మంది జవాన్లు అమరులైనపుడు పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ లు నడుస్తున్నాయి. అయితే ఉగ్ర చర్యలతో ఇండియా ను విసిగిస్తున్న కారణంగా.. PCL ప్రసారాలను భారత్ నిలిపివేసింది. దీంతో పాటు.. PCLకు అఫీషియల్ ప్రొడక్షన్ పార్టనర్ గా ఉన్న IMG రిలయన్స్ ఇకపై లీగ్ తో భాగస్వామ్యాన్ని కొనసాగించమని స్పష్టం చేసింది. భారత ఆటగాళ్లు కూడా పుల్వామా లో అమరులైన జవాన్ల త్యాగాలకు సంతాపంగా.. ఆర్మీ క్యాప్ ధరించి ఒక మ్యాచ్ ను ఆడింది. ఈ విషయం పై పాక్ ICC కి ఫిర్యాదు కూడా చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ కూడా IPL 2019 మ్యాచ్ లను వాళ్ల దేశంలో ప్రసారం చేయమని ప్రకటించింది.