కింగ్స్ లెవన్ పై కోల్‌‌‌‌‌‌‌‌కతా గ్రాండ్ విక్టరీ

కింగ్స్ లెవన్ పై కోల్‌‌‌‌‌‌‌‌కతా గ్రాండ్ విక్టరీ
  • కోల్ కత్తి.. పంజాబ్ పేకప్
  • చెలరేగిన గిల్, క్రిస్ లిన్

రెండు జట్లకూ జీవన్మరణ పోరాటం. ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే విజయం అవసరం. ఇలాంటి  పోరులో కోల్‌‌‌‌‌‌‌‌కతా కత్తిలాంటి ఆటతో విజృంభించిం ది. హోరాహోరీ తప్పదనకున్న మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను అదిరిపోయే బ్యాటింగ్‌ తో వన్‌ సైడ్‌ చేసేసింది. పంజాబ్‌‌‌‌‌‌‌‌నువారి హోమ్‌ గ్రౌండ్‌ లో చిత్తు చేసి ప్లేఆఫ్‌ అవకాశాలను సజీవంగా నిలుపుకుం ది. కుర్ర  బ్యాట్స్‌ మెన్‌ సామ్‌ కరన్‌ , నికోలస్‌ పూరన్‌ పోరాటంతో మంచి స్కోరే చేసినా చెత్త బౌలింగ్‌తో పంజాబ్‌‌‌‌‌‌‌‌ చిత్తుగా ఓడింది. సాంకేతికంగా రేసులోనే ఉన్నా తమ తర్వాతి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో కింగ్స్‌ లెవెన్‌ 160 రన్స్‌ తేడాతో గెలవాలి. అదే సమయంలో బెంగళూరు చేతిలో సన్‌ రైజర్స్‌ 100 రన్స్‌ తేడాతో ఓడిపోవాలి. ఈ రెండూ జరిగే పనులు కాదు కాబట్టి పంజాబ్‌‌‌‌‌‌‌‌ లీగ్‌ కు పేకప్‌ చెప్పేసినట్టే.

మొహాలీ: చావోరేవో లాంటి మ్యాచ్‌ లోకోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ బ్యాట్స్‌ మెన్‌ చెలరేగారు. 184  పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి ప్లే ఆఫ్‌‌‌‌‌‌‌‌ రేసు నుంచి పంజాబ్‌ పేకప్‌ చెప్పేలా చేశారు. ఓపెనర్లు శుభ్‌ మన్‌ గిల్‌ ( 49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 65 నాటౌట్‌ ), క్రిస్‌ లిన్‌ (22 బంతుల్లో 5ఫోర్లు, 3 సిక్సర్లతో 46) ధనాధన్‌ బ్యాటింగ్‌ తో చెలరేగిన వేళ శుక్రవారం జరిగిన మ్యాచ్‌ లో కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ ఏడు వికెట్ల తేడాతో పంజాబ్‌ పై ఘన విజయం సాధించింది. ప్లేఆఫ్‌‌‌‌‌‌‌‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. తొలుత ఆల్‌ రౌండర్‌ సామ్‌ కరన్‌ (24 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్సర్లతో 55 నాటౌట్‌ ) మెరుపులతో పంజాబ్‌ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. నికోలస్‌ పూరన్‌( 27 బంతుల్లో 3ఫోర్లు, 4 సిక్సర్లతో 48),మయాంక్‌ అగర్వాల్‌ (26 బంతుల్లో 2 ఫోర్లు,సిక్సర్‌ తో 36) సత్తా చాటారు . కోల్‌కతా బౌలర్లలో సందీప్‌ వారియర్‌ (2/31) రెండు వికెట్లు తీశాడు. అనంతరం కోల్‌ కతా 18 ఓవర్లలో 3 వికెట్లకు 185 రన్స్‌ చేసి సులువుగా గెలిచింది.ఈ విజయంతో ప్లే ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఆశలు సజీవంగా ఉంచుకున్న రైడర్స్‌ కు లీగ్‌ దశలో ముంబైతో జరిగే ఆఖరి మ్యాచ్‌ కీలకం కానుంది.

గిల్‌‌‌‌‌‌‌‌ హిట్‌‌‌‌‌‌‌‌.. పంజాబ్‌‌‌‌‌‌‌‌ ఫట్‌‌‌‌‌‌‌‌

భారీ ఛేజింగ్‌ లో ఓపెనర్లు శుభ్‌ మన్‌ గిల్, క్రిస్‌లిన్‌ నైట్‌ రైడర్స్‌ కు అదిరిపోయే ఆరంభాన్నిఇచ్చారు. 36 బంతుల్లో 62 పరుగులు జోడించిన లిన్‌ – గిల్‌ జట్టు విజయానికి బలమైన పునాది వేశారు. ఎడాపెడా బౌండరీలు బాదేసిన లిన్‌ పవర్‌ ప్లే ఆఖరి బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి బౌలర్‌ ఆండ్రూ టైకి రిటర్న్‌‌‌‌‌‌‌‌ క్యాచ్ ఇచ్చివెనుదిరిగాడు. గిల్‌ తో పాటు వన్‌ డౌన్‌ లో వచ్చిన రాబిన్‌ ఊతప్ప(22) కూడా ధాటిగా ఆడడంతో పది ఓవర్లు ముగిసే సరికి రైడర్స్‌ స్కోరు 98కి చేరింది. అయితే 11వ ఓవర్‌ లో మరోసారి బౌలింగ్‌ కు వచ్చిన అశ్వి న్‌ .. ఊతప్ప వికెట్‌ తీసి జట్టుకు బ్రేక్‌ ఇచ్చాడు. దీంతో క్రీజులోకి వచ్చిన ఆండ్రీ రసెల్‌ (14బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24) ఎదుర్కొన్నమూడో బంతినే బౌండరీకి తరలించాడు. అశ్వి న్‌వేసిన 13వ ఓవర్‌ లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌ కొట్టినగిల్‌ 36 బంతుల్లో హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ పూర్తి చేశాడు. టై వేసిన 14వ ఓవర్‌ లో రెండు సిక్సర్లు కొట్టిన రసెల్‌ కులైఫ్‌‌‌‌‌‌‌‌ దొరిక ింది. అతనిచ్చి న క్యా చ్‌ ను లాం గాఫ్‌‌‌‌‌‌‌‌లోమయాంక్‌ అందుకోలేకపోయాడు. అయితే ఆతర్వా త షమీ బౌలింగ్‌ లో రసెల్‌ మరో భారీ షాట్‌ఆడగా డీప్‌ స్క్వేర్‌ లో ఆండ్రూ టై దాన్ని క్యా చ్‌ పట్టుకోవడంతో పంజాబ్ శిబిరం ఊపిరి పీల్చుకుం ది.అయితే 15 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లుకోల్పోయి 151 పరుగులు చేసిన నైట్‌ రైడర్స్‌ మాత్రం బలమైన స్థితిలోనే ఉంది. ఆ తర్వాత గిల్‌ కు జతకలిసిన దినేశ్‌ కార్తీ క్‌ (21 నా టౌట్‌ ) పంజాబ్‌ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మరో 12బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ ను ముగించాడు.

పూరన్‌ స్టార్ట్‌‌‌‌‌‌‌‌.. కరన్‌ ఫినిష్‌

పంజాబ్‌ ఇన్నింగ్స్‌ లో ఆటంతా ఇద్దరిదే. తొలుత నికోలస్‌ పూరన్‌ ధాటిగా ఆడి పునాది వేస్తే, ఆఖర్లో సామ్‌ కరన్‌ మెరు పులతో కింగ్స్‌ లెవెన్‌ మంచి స్కోరు చేయగలిగింది. అయితే, టాస్‌ ఓడి బ్యాటింగ్‌ కు దిగిన పంజాబ్‌ ఆరంభంలో ఇబ్బంది పడింది.ఫామ్‌ లో ఉన్న ఓపెనర్లు లోకేశ్‌ రాహుల్‌ (2), క్రిస్‌గేల్‌ (14)ను వరుస ఓవర్లలో పెవిలియన్‌ చేర్చిన సందీ ప్‌ వారియర్‌ పంజాబ్‌ కు షాకిచ్చాడు. వన్‌ డౌన్‌ లో వచ్చి న మయాంక్‌ అగర్వాల్‌ , నికోలస్‌ పూరన్‌ ఇన్నింగ్స్‌ ను చక్కదిద్దారు . మయాంక్‌ స్ట్రయిక్‌ రొటేట్‌ చేయగా.. పూరన్‌ స్వేచ్ఛగా షాట్లు కొట్టాడు.గుర్నీ వేసిన ఆరో ఓవర్‌ లో సిక్సర్‌ , రసెల్‌ బౌలింగ్‌ 6,4తో జోరు పెంచాడు. అతని జోరుతో పది ఓవర్లకు పంజాబ్‌ 84/2తో నిలిచింది. అయితే హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీకి చేరు వైన పూరన్‌ ను ఔట్‌ చేసిన నితీశ్‌ రాణా రైడర్స్‌ కు బ్రేక్‌ ఇచ్చాడు. మన్‌ దీప్‌ సింగ్‌(25) వేగంగానే ఆడినా.. 14వ ఓవర్లో మయాంక్‌ రనౌటవ్వడంతో కింగ్స్‌ లెవెన్‌ ఇన్సింగ్స్‌ మరోసారి కుదుపుకు గురైంది. ఈ దశలో మన్‌ దీ ప్‌ తో కలిసిసామ్‌ కరన్‌ పోరాటం కొనసాగించాడు. మంచి షాట్లతో బౌండ్రీలు కొడుతూ పరుగులు రాబట్టాడు. నరైన్‌ వేసిన 17వ ఓవర్లో భారీ సిక్స్‌ కొట్టిన కరన్‌ వెంటనే ఇచ్చిన క్యాచ్‌ను రింకూ సింగ్‌ అందుకోలేపోయాడు. ఈ చాన్స్‌ ను సద్వినియోగం చేసుకున్నకరన్‌ ఓ రేంజ్​లో చెలరేగాడు.18వ ఓవర్లో మన్‌ దీప్‌ వెనుదిరిగినా.. సామ్‌ మాత్రం భారీ షాట్లతో విజృంభించాడు. 19వ ఓవర్లో రసెల్‌ తొలి బాల్‌ కే అశ్వి న్‌(0)ను బౌల్డ్‌‌‌‌‌‌‌‌ చేసినా.. కరన్‌ రెండు ఫోర్లు రాబట్టాడు.గుర్నీ వేసిన లాస్ట్‌‌‌‌‌‌‌‌ ఓవర్లో 4,6,4,4తో రెచ్చి పోయిఏకంగా 22 రన్స్‌ పిండుకున్న కరన్‌ జట్టు కు మంచిస్కోరు అందించాడు.

స్కోర్‌ బోర్డు

పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: గేల్‌ (సి) గిల్‌ (బి) సందీ ప్‌ 14,రాహుల్‌ (సి) లిన్‌ (బి) సందీ ప్‌ 2, మయాం క్‌(రనౌట్‌ ) 36, పూరన్‌ (సి) సందీ ప్‌ (బి) రాణా48, మన్‌ దీ ప్‌ (సి) ఊతప్ప (బి) గుర్నీ 25,కరన్‌ (నా టౌట్‌ ) 55, అశ్వి న్‌ (బి) రసెల్‌ 0,టై (నా టౌట్‌ ) 0 ; ఎక్స్‌ ట్రాలు : 3 ; మొత్తం :20 ఓవర్లలో 183/6;

వికెట్ల పతనం: 1–13,2–22, 3–91, 4–111, 5–149, 6–151;బౌలింగ్‌ : సందీ ప్‌ 4–0–31–2, గుర్నీ4–0– 41–1, నరైన్‌ 4–0–29–0, రసెల్‌3–0– 29–1, చావ్లా 4-–0–- 43–-0, రాణా1–0–8–1.

కోల్‌‌‌‌‌‌‌‌కతా నైట్‌‌‌‌‌‌‌‌ రైడర్స్‌ : గిల్‌ (నాటౌట్‌ ) 65,లిన్‌(సి అండ్‌ బి) టై 46, ఊతప్ప (సి) మయాంక్‌(బి) అశ్వి న్‌ 22; రసెల్‌ (సి) టై (బి) షమీ24, కార్తీక్‌ (నాటౌట్‌ ) 21; ఎక్స్‌ ట్రాలు :7 ;మొత్తం : 18 ఓవర్లలో 185/3;

వికెట్ల పతనం: 1–62, 2–100,3–150; బౌలింగ్‌ : షమీ3–0–15–1, అర్షదీప్‌ 2–0–24–0, అశ్వి న్‌4–0–38–1, ఆండ్రూ టై 3–0–41–1,మురుగన్‌ 2–0–24–0, కరన్‌ 4–0–41–0.