IPL -2019 షెడ్యూల్‌ను BCCI విడుదల చేసింది. కేవలం 17 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించింది. మొదటి మ్యాచ్‌లో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, కోహ్లి కెప్టెన్సీలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ తలపడనున్నాయి. మార్చి 23న ఐపీఎల్ సీజన్ -12 చెన్నై వేదికగా టోర్నీ ప్రారంభం కానుంది. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా తొలి రెండు వారాల షెడ్యూల్‌ను మాత్రం బోర్డు విడుదల చేసింది. ఈ రెండు వారాల్లో..8వేదికల్లో మొత్తం 17 మ్యాచ్‌లు జరగనున్నాయి. అన్ని జట్లు 4 మ్యాచ్ లు ఆడనున్నాయి. మిగతా షెడ్యూల్‌ను లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రకటించనుంది.

