ధోనీకి కరోనా నెగిటివ్‌.. చెన్నైకి మిస్టర్ కూల్ ప్రయాణం

ధోనీకి కరోనా నెగిటివ్‌.. చెన్నైకి మిస్టర్ కూల్ ప్రయాణం

రాంచీ: ఐపీఎల్‌ 2020కి సన్నాహకాలు మొదలయ్యాయి. వచ్చే నెల 19న యూఏఈలో మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఫ్రాంచైజీలు ఆటగాళ్లను సమాయత్తం చేయడంతో బిజీ అవుతున్నాయి. తాజాగా ఎంఎస్ ధోనికి కరోనా టెస్టులు నిర్వహించారు. వీటిల్లో నెగిటివ్‌ వచ్చింది. దీంతో ఈ నెల 15 నుంచి మొదలవనున్న చైన్నైలో జరిగే టీమ్ ప్రాక్టీస్ క్యాంపులో జాయిన్ కానున్నాడు. ప్రైవేట్ ఆస్పత్రికి స్వాబ్‌ను సమర్పించిన తర్వాత మాహి చెన్నైకి పయనం అవనున్నాడు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఎస్‌ఓపీ మేరకు ధోనీకి కరోనా టెస్టులు చేశారు. బీసీసీఐ ప్రోటోకాల్ ప్రకారం ఫ్రాంచైజీలు యూఏఈకి చేరుకునే లోపు ప్రతి ప్లేయర్‌‌కు రెండు కరోనా నెగిటివ్ టెస్టులు చేయడం తప్పనిసరి. సీఎస్‌కే ట్రెయినింగ్ క్యాంపులో ధోనీతోపాటు హర్భజన్ సింగ్, సురేష్ రైనా, అంబటి రాయుడు పాల్గొననున్నారు. ఈ నెల 15 నుంచి 20 వరకు జరిగే ఈ ఆరు రోజుల క్యాంపును జడేజా మిస్ అవనున్నాడని తెలిసింది.