ఆస్ట్రేలియా పించ్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ మినీ వేలంలో ధమాకా సృష్టించాడు. ఈ హార్డ్ హిట్టర్‌ను రూ.14.25 కోట్ల ధరకు ఆర్సీబీ దక్కించుకుంది. దీంతో కోహ్లీ, డివిలియర్స్‌తో కలసి ఆర్సీబీకి దన్నుగా నిలిచేందుకు మ్యాక్సీ రెడీ అవుతున్నాడు. ఈ విషయంపై మ్యాక్స్‌వెల్ స్పందించాడు. క్రికెట్‌లో శిఖరం లాంటి కోహ్లీ నుంచి కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఉత్సుకతతో ఉన్నానని చెప్పాడు. ‘ఆర్సీబీకి ఆడనుండటంపై సంతోషంగా ఉన్నా. కోహ్లీతో కలసి ఆడాలని ఎదురు చూస్తున్నా. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో అతడు పర్వతం లాంటి వాడు. కెప్టెన్‌గా ఉండే ఒత్తిడిని ఎదుర్కొంటూ బెస్ట్ ప్లేయర్‌గా కొనసాగడం అంటే మాటలు కాదు. అతడు గేమ్ ఆడే తీరు, ట్రెయినింగ్‌ను దగ్గరుండి గమనించాలని, నేర్చుకోవాలని భావిస్తున్నా’ అని మ్యాక్సీ పేర్కొన్నాడు.
