రసెల్‌ షో .. కోల్‌కతా ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవం

V6 Velugu Posted on May 15, 2022

ప్లే ఆఫ్స్‌‌‌‌ రేస్‌‌ నేపథ్యంలో.. ఇరుజట్లకు కీలకమైన మ్యాచ్‌‌లో కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌ జూలు విదిల్చింది..! ఆండ్రీ రసెల్‌‌ (28 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 49 నాటౌట్‌‌, 3/22) ఆల్‌‌రౌండ్‌‌ షోతో అదరగొట్టిన వేళ.. సూపర్‌‌ విక్టరీతో నాకౌట్‌‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది..! మరోవైపు వరుసగా ఐదో ఓటమితో సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ నాకౌట్‌‌ ఆశలను సంక్లిష్టం చేసుకుంది..! టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో అభిషేక్‌‌ (28 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 43) మినహా మిగతా వారు విఫలమవడంతో.. రైజర్స్‌‌కు ఏడో ఓటమి తప్పలేదు..!!


పుణె: ఐపీఎల్‌‌‌‌లో హైదరాబాద్‌‌కు మరో ఓటమి. టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో బ్యాటర్లు నిరాశపర్చడంతో.. శనివారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో 54 రన్స్‌‌ తేడాతో కోల్‌‌కతా చేతిలో పరాజయం పాలైంది. టాస్‌‌ గెలిచి బ్యాటింగ్‌‌కు దిగిన కోల్‌‌కతా 20 ఓవర్లలో 177/6 స్కోరు చేసింది. రైజర్స్ బౌలర్లలో ఉమ్రాన్ (3/33) ఆకట్టుకున్నాడు. తర్వాత హైదరాబాద్ ఓవర్లన్నీ ఆడి 123/8 స్కోరుకే పరిమితమైంది. అభిషేక్‌‌, మార్‌‌క్రమ్‌‌ (32) మినహా మిగతా వారు విఫలమయ్యారు. రసెల్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

రసెల్ మెరుపులు..

మొదట బ్యాటింగ్‌‌లో కోల్‌‌కతాకు సరైన ఆరంభం లభించలేదు. రెండో ఓవర్లోనే వెంకటేశ్ (7)ను ఔట్ చేసిన జాన్సెన్.. రైజర్స్‌‌కు బ్రేక్ ఇచ్చాడు. ఆపై రహానే (28), నితీశ్ రాణా (26) కాసేపు జాగ్రత్తగా ఆడారు. మొదట నెమ్మదిగా ఆడినా నటరాజన్ వేసిన ఐదో ఓవర్లో 4, 6, 6తో రాణా ఇన్నింగ్స్‌‌లో వేగం పెంచాడు. ఆ తర్వాతి ఓవర్లోనూ వీరిద్దరూ చెరో సిక్స్ బాదారు. అయితే వరుసగా రెండు ఓవర్లలో రహానె, రాణాతో పాటు కెప్టెన్ శ్రేయస్ (15)ను ఔట్ చేసి ఉమ్రాన్.. కేకేఆర్‌‌ను దెబ్బతీశాడు. దీంతో 10 ఓవర్లలో 83/ 4తో నిలిచిన కోల్‌‌కతా మంచి స్థితిలోనే కనిపించింది. కానీ హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో మిడిల్‌‌లో కేకేఆర్ ఇన్నింగ్స్ స్లోగా సాగింది. 12వ ఓవర్లో రింకూ సింగ్ (5)ను ఔట్ చేసిన నటరాజన్ మరో బ్రేక్‌‌ ఇచ్చాడు. ఈ దశలో రసెల్, బిల్లింగ్స్ (34) మెరుపులు మెరిపించారు. 16వ ఓవర్లో బిల్లింగ్స్, 17వ ఓవర్లో రసెల్ చెరో రెండు ఫోర్లు కొట్టారు. నటరాజన్ బౌలింగ్‌‌లో సిక్స్ బాదిన బిల్లింగ్స్ స్కోరును 150 దాటించాడు. 19ఓవర్ లో బిల్లింగ్స్‌‌ను భువీ ఔట్ చేసి 6 రన్స్ ఇవ్వగా.. సుందర్ వేసిన ఆఖరి ఓవర్లో మూడు సిక్స్‌‌లు బాదిన రసెల్ జట్టుకు మంచి స్కోరు అందించాడు.

రైజర్స్ పోరాడలే..

ఛేజింగ్‌‌ను రైజర్స్ నెమ్మదిగా మొదలు పెట్టింది. కోల్‌‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో స్కోరు బోర్డులో వేగం తీసుకొచ్చేందుకు నానా కష్టాలు పడింది. అభిషేక్‌‌తో కలిసి ఓపెనింగ్‌‌కు వచ్చిన కెప్టెన్ విలియమ్సన్ (9) మరోసారి నెమ్మదిగా ఆడి విమర్శల పాలయ్యాడు. ఆరో ఓవర్లోనే అతడిని రసెల్ బౌల్డ్ చేసినా.. పవర్ ప్లేలో 31/1 స్కోరు చేసింది. ఈ దశలో నరైన్ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన అభిషేక్ ఇన్నింగ్స్ ను గాడినపెట్టే ప్రయత్నం చేశాడు. త్రిపాఠి (9) విఫలమైన దశలో మార్‌‌క్రమ్‌‌తో కలిసి అభిషేక్ జాగ్రత్తగా ఆడాడు. కానీ వరుస ఓవర్లలో అభిషేక్, నికోలస్ పూరన్ (2) వెనుదిరిగారు. ఇక మూడు సిక్స్ లతో దూకుడు చూపించిన మార్‌‌క్రమ్‌‌ను.. ఉమేశ్ బౌల్డ్ చేయడంతో 14.4 ఓవర్లలో 99/5తో రైజర్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. లోయర్‌‌ ఆర్డర్‌‌లో శశాంక్‌‌ సింగ్‌‌ (11), జాన్సెన్‌‌ (1), సుందర్‌‌ (4), భువనేశ్వర్‌‌ (6 నాటౌట్‌‌) విఫలంకావడంతో హైదరాబాద్‌‌కు ఓటమి తప్పలేదు. 

Tagged KKR, Andre Russell, IPL 2022, allround show

Latest Videos

Subscribe Now

More News