
ముంబై: ఐపీఎల్ 15వ సీజన్ ముంబైలోనే జరిగే అవకాశం కనిపిస్తోంది. కరోనా నేపథ్యంలో లీగ్‌ను వివిధ సిటీల్లో కాకుండా మొత్తం ముంబైలోనే ఆర్గనైజ్ చేయాలని గురువారం జరిగిన మీటింగ్‌లో బీసీసీఐ ఆఫీస్ బేరర్లు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త సీజన్‌ను ముంబైలో ఆర్గనైజ్ చేయడమే బెస్ట్ ఆప్షన్ అని బోర్డు భావిస్తోంది. ముంబై, దాని చుట్టుపక్కల ఉన్న మూడు స్టేడియాల్లో అన్ని మ్యాచ్‌లను షెడ్యూల్ చేయాలని బోర్డు కన్ఫామ్ చేసినట్టు ది టెలిగ్రాఫ్ కథనం ప్రచురించింది. ‘ప్రస్తుతానికి మేం ముంబైని దాటి ఆలోచించడం లేదు. కరోనా థర్డ్‌వేప్ కూడా కంట్రోల్‌లోకి వస్తోంది. కాబట్టి టోర్నీని ఫారిన్‌కు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు’ అని బోర్డు అధికారి ఒకరు చెప్పారని పేర్కొంది. ముంబైలోని వాంఖడే, బ్రబౌర్న్‌తో పాటు నేవి ముంబైలోని డీవై పాటిల్ స్టేడియాలను బోర్డు ఇప్పటికే షార్ట్ లిస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అవసరం అయితే పుణెను కూడా ఓ వేదికగా వాడుకోవాలని చూస్తోంది. ఈ స్టేడియాలకు చేరుకునేందుకు ఫ్లైట్ జర్నీ అవసరం లేదు. అదే టైమ్‌లో ఈ స్టేడియాలకు దగ్గర్లోనే చాలా 5 స్టార్ హోటల్స్ ఉండటంతో బయో బబుల్‌ను మెయింటేన్ చేయడం కూడా ఈజీ అవుతుంది. అందుకే బోర్డు పెద్దలు ముంబైనే ప్రిఫర్ చేస్తున్నారు. వచ్చే నెల మెగా ప్లేయర్ ఆక్షన్ జరిగిన వారంలోపు ఐపీఎల్ వేదిక గురించి బీసీసీఐ అధికారిక ప్రకటన చేయనుంది.