ఐపీఎల్: ఇవాళ లక్నో వర్సెస్ గుజరాత్‌‌‌‌

ఐపీఎల్: ఇవాళ లక్నో వర్సెస్ గుజరాత్‌‌‌‌

ముంబై: ఐపీఎల్–15వ సీజన్ లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ లీగ్ లో కొత్తగా అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్రత్యర్థులుగా తమ తొలి పోరులో తలపడబోతున్నాయి. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని గుజరాత్, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లక్నో సోమవారం వాంఖడేలో జరిగే మ్యాచ్ లో గెలిచి లీగ్ లో బోణీ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నాయి.

గుజరాత్ టీమ్ యంగ్ బ్యాటర్ శుభ్ మన్ గిల్ తో పాటు అఫ్గానిస్తాన్ ప్లేయర్ రెహ్మనుల్లా గుబ్రాజ్ లను ఓపెనర్లుగా దించే అవకాశం ఉంది. మిడిల్ లో రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్ పై భారీ ఆశలు ఉన్నాయి. బౌలింగ్ లో పేస్ బాధ్యతలకు మహ్మద్ షమీ, స్పిన్ విభాగానికి రషీద్ ఖాన్ నేతృత్వం వహించనున్నారు. ఇక లక్నో టీమ్ కు ఓపెనర్లు కెప్టెన్ రాహుల్, క్వింటన్ డికాక్ రూపంలో అదిరిపోయే ఆరంభం లభించడం పక్కాగా కనిపిస్తోంది. మనీష్ పాండే, దీపక్ హుడా, క్రునాల్ పాండ్యా, జాసన్ హోల్డర్ రెచ్చిపోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.