CSK vs KKR: చెన్నై vs కోల్‌కతా.. గెలిచే జట్టేది..?

CSK vs KKR: చెన్నై vs కోల్‌కతా.. గెలిచే జట్టేది..?

ఐపీఎల్ లో నేడు ఆసక్తికర పోరు జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడబోతుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. మ్యాచ్ సాయంత్రం 7:30 నిమిషాలకు జరగనుంది. ఇరు జట్లు బలంగా ఉండడంతో ఈ జట్టుకు గెలిచే అవకాశాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం 

చెన్నై సూపర్ కింగ్స్ :

టోర్నీలో చెన్నై జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది. ఆడిన తొలి రెండు మ్యాచ్ ల్లో గెలిచి టేబుల్ టాపర్ గా  నిలిచింది. తొలి మ్యాచ్ లో ఆర్సీబీ జట్టుపై.. ఆ తర్వాత మ్యాచ్ లో గుజరాత్ జట్టుపై అలవోక విజయాలను సాధించింది. అయితే ఆ తర్వాత చెన్నై జట్టుకు వరుస పరాజయాలు పలకరించాయి. ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. బ్యాటింగ్ లో నిలకడ కనిపించడం లేదు. దూబే మినహా ఎవరూ రాణించడం లేదు. 

ఇక బౌలింగ్ లో చెన్నై సమిష్టిగా రాణిస్తుంది. పతిరానా, ముస్తఫిజుర్ రూపంలో ఇద్దరు విదేశీ పేసర్లు ఈ మ్యాచ్ కు అందుబాటులోకి రావడంతో ఆ జట్టు గెలుపుపై ధీమాగా ఉంది. చాహర్, శార్దూలు ఠాకూర్, తుషార్దేశ్ పాండే రూపంలో పేస్ బౌలింగ్ దుర్బేధ్యంగా కనిపిస్తుంది. రవీంద్ర జడేజా, తీక్షణ రూపంలో ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు ఉండడంతో చెన్నై అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తుంది. 

కోల్‌కతా నైట్ రైడర్స్:

ఐపీఎల్ లో కేకేఆర్ కు తిరుగులేకుండా పోతుంది. ఆడిన మూడు మ్యాచ్ ల్లో వరుస విజయాలు సాధించి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఎలాంటి సమస్యలు లేవు. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షోతో అదరగొట్టడంతో పాటు మిగిలినవారందరూ ఫామ్ లోనే ఉన్నారు. ఫామ్ లో లేని స్టార్క్ గాడిలో పడడం ఆ జట్టుకు ఊరటనిచ్చే అంశం. మొదటి మ్యాచ్ ల్లో ఫామ్ ను ఈ మ్యాచ్ లోనో గెలిచి టేబుల్ టాప్ లోకి దూసుకెళ్లాలని భావిస్తుంది. 

బలాబలాను పరిశీలిస్తే ఈ మ్యాచ్ లో  కోల్‌కతా గెలవడం ఖాయంగా కనిపిస్తుంది. సొంతగడ్డపై ఆడుతుండడం చెన్నైకి కలిసి రానుంది. కేకేఆర్ కు 60 శాతం గెలిచే అవకాశాలు ఉంటే.. చెన్నై సూపర్ కింగ్స్ కు 40 శాతం ఛాన్సులు ఉన్నాయి. మరి ఏ జట్టు గెలిచి తమ ఖాతాలో రెండు పాయింట్లను వేసుకుంటుందో చూడాలి.