
అసలే ఆదివారం.. బయట ఎండలు దంచికొడుతున్నాయి.. బయటకెళ్ళే పరిస్థితి లేదు.. ఇంకేముంది, కుటుంబసమేతంగా ఐపీఎల్ మ్యాచ్‌లు చూస్తూ ఎంజాయ్ చేయండి.. ఏసీనో.. కూలరో వేసుకొని, చికెన్, మటన్ ముక్కలు తినుకుంటూ.. చల్లగా మ్యాచ్ మజా ఆస్వాదించండి. మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకూ మస్త్ ఎంజాయ్ చేయొచ్చు.
ఐపీఎల్ 2024లో భాగంగా నేడు(ఏప్రిల్ 7) రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్.. రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుండగా.. రెండో మ్యాచ్ రాత్రి 7 గంటలకు షురూ కానుంది.
- మధ్యాహ్నం 3 గంటలకు: ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (వాంఖడే స్టేడియం, ముంబై)
- రాత్రి 7 గంటలకు: లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్ (ఎకానా స్టేడియం, లక్నో)
It's ?ℍ?????? ⏱️#MumbaiMeriJaan #MumbaiIndians #MIvDC #ESADay #EducationAndSportsForAll pic.twitter.com/vSkLEuEl8D
— Mumbai Indians (@mipaltan) April 7, 2024