
డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ తమ కొత్త సారథిని ప్రకటించింది. భారత సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే(Ajinkya Rahane) జట్టు పగ్గాలు అప్పగించింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో రహానే కేకేఆర్(KKR) జట్టును నడిపించున్నాడు. ఈ మేరకు కేకేఆర్ ఫ్రాంఛైజీ సోమవారం తమ అధికారిక ‘ఎక్స్(X)’ ఖాతాలో ఈ విషయాన్ని ప్రకటించింది. అతనికి డిప్యూటీగా యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్‌ను నియమించింది.
Also Read :- మనోళ్లకు రెస్ట్ లేదు.. ఆస్ట్రేలియాకు అనుకూలంగా సెమీస్ ఫైట్
రహానే ధర.. కోటిన్నర
గతేడాది జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో కోల్‌కతా యాజమాన్యం రహానేను రూ.1.50 కోట్ల తక్కువ ధరకు సొంతం చేసుకుంది. రహానేపై టెస్ట్ బ్యాటర్‌గా ముద్రపడినప్పటికీ, గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు(13 ఇన్నింగ్స్‌లలో 242 పరుగులు)కు అతడిచ్చిన మెరుపు ఆరంభాలు అంత ఈజీగా మరిచిపోలేరు. రహానే మంచి క్లాస్ ప్లేయర్. దీనికితోడు రహానే గతంలో రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్లకు కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉండటంతోప్రాంచైజీ అతని వైపు మొగ్గుచూపింది.
? ???????? ???????????? - Ajinkya Rahane named captain of KKR. Venkatesh Iyer named Vice-Captain of KKR for TATA IPL 2025. pic.twitter.com/F6RAccqkmW
— KolkataKnightRiders (@KKRiders) March 3, 2025
KKR ఎనిమిదో కెప్టెన్
ఐపీఎల్‌లో కేకేఆర్‌కు నాయకత్వం వహించిన 8వ కెప్టెన్ రహానే. గతంలో సౌరవ్ గంగూలీ, బ్రెండన్ మెకల్లమ్, గౌతమ్ గంభీర్, దినేష్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్, శ్రేయాస్ అయ్యర్, నితీష్ రాణాలు కేకేఆర్ కెప్టెన్లుగా వ్యవహరించారు.
కేకేఆర్ ఐపీఎల్ 2025 షెడ్యూల్
- మార్చి 22: KKR vs RCB (కోల్‌కతా)
- మార్చి 26: KKR vs RR (గౌహతి)
- మార్చి 31: KKR vs MI (ముంబై)
- ఏప్రిల్ 3: KKR vs SRH (కోల్‌కతా)
- ఏప్రిల్ 6: KKR vs LSG (కోల్‌కతా)
- ఏప్రిల్ 11: KKR vs CSK (చెన్నై)
- ఏప్రిల్ 15: KKR vs PBKS (న్యూ చండీగఢ్)
- ఏప్రిల్ 21: KKR vs GT (కోల్‌కతా)
- ఏప్రిల్ 26: KKR vs PBKS (కోల్‌కతా)
- ఏప్రిల్ 29: KKR vs DC (ఢిల్లీ)
- మే 4: KKR vs RR (కోల్‌కతా)
- మే 7: KKR vs CSK (కోల్‌కతా)
- మే 10: KKR vs SRH (హైదరాబాద్)
- మే 17: KKR vs RCB (బెంగళూరు)
ఐపీఎల్ 2025 కేకేఆర్ స్క్వాడ్:
అజింక్యా రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, రమణదీప్ సింగ్, క్వింటన్ డి కాక్, రహమానుల్లా గుర్బాజ్, అన్రిచ్ నోర్‌క్రిష్‌బ్యాజ్, అన్రిచ్ నోర్‌క్రిష్‌హవ్, మయాంక్ మార్కండే, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, స్పెన్సర్ జాన్సన్, లువ్నిత్ సిసోడియా, అనుకుల్ రాయ్, మొయిన్ అలీ, ఉమ్రాన్ మాలిక్.