
రెండున్నర నెలల పాటు 70 లీగ్ మ్యాచ్‌లు.. మూడు ప్లేఆఫ్స్.. ఒక ఫైనల్ తో అభిమానులని అలరించిన ఐపీఎల్ 2025 మంగళవారం (జూన్ 3) ముగిసింది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి సారి ఐపీఎల్ టైటిల్ అందుకుంది. ఐపీఎల్ చరిత్రలో రెండోసారి ఫైనల్ కు చేరుకున్న పంజాబ్ కింగ్స్ కు మరోసారి నిరాశే తప్పింది. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ లో కొంతమంది ఆటగాళ్లు అత్యద్భుతంగా రాణించి అవార్డ్స్ గెలుచుకున్నారు. ఎవరెవరికి ఏయే అవార్డ్స్ వచ్చాయో ఇప్పుడు చూద్దాం.
ఐపీఎల్ 2025 ఫైనల్ విన్నర్, రన్నరప్ ప్రైజ్ మనీ
ఈ సీజన్ లో ఐపీఎల్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రూ. 20 కోట్లు ప్రైజ్ మనీ ఇచ్చారు. ఇక రన్నరప్ గా నిలిచిన పంజాబ్ కింగ్స్ కు రూ. 13 కోట్ల ప్రైజ్ మనీ అందుకుంది. మూడో నాలుగో స్థానంలో నిలిచిన జట్లకు వరుసగా రూ. 7 కోట్లు.. రూ. 6.5 కోట్లు ప్రైజ్ మనీ అందుతాయి. క్వాలిఫయర్ 2 లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ మూడో స్థానంలో నిలిచింది. హార్దిక్ సేనకు రూ. 7 కోట్ల రూపాయాలు అందుతాయి. ఇక ముంబైపై ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓడిన గుజరాత్ టైటాన్స్ కు రూ.6.5 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది.
Also Read : RCB విజయంపై అల్లు అయాన్ ఎమోషనల్
ఐపీఎల్ 2025 ఆరెంజ్ క్యాప్ విజేత:
ఐపీఎల్ 2025 లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ గా నిలిచాడు. ఈ సీజన్ లో 15 మ్యాచ్ ల్లో 759 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. ఇందుకు గాను సుదర్శన్ కు రూ. 10 లక్షల రూపాయాలు లభించాయి.
ఐపీఎల్ 2025 పర్పుల్ క్యాప్ విజేత:
ఐపీఎల్ 2025 లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ప్లేయర్ గా గుజరాత్ టైటాన్స్ బౌలర్ ప్రసిద్ కృష్ణ నిలిచాడు. ఈ సీజన్ లో 15 మ్యాచ్ ల్లో 25 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. ఇందుకు గాను ప్రసిద్ కృష్ణకు రూ. 10 లక్షల రూపాయాలు లభించాయి.
ఐపీఎల్ 2025 అవార్డ్స్ పూర్తి అవార్డ్స్ లిస్ట్:
విజేత- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)
ఐపీఎల్ 2025 ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కృనాల్ పాండ్యా
ఐపీఎల్ 2025 ఫైనల్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్: జితేష్ శర్మ
ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్ డాట్ బాల్స్: మహ్మద్ సిరాజ్
ఐపీఎల్ 2025 సీజన్‌లో సూపర్ స్ట్రైకర్ (అత్యధిక సిక్సర్లు): నికోలస్ పూరన్
ఐపీఎల్ 2025 ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: సాయి సుదర్శన్
ఐపీఎల్ 2025 అత్యంత విలువైన ఆటగాడు: సూర్యకుమార్ యాదవ్
ఐపీఎల్ 2025 పర్పుల్ క్యాప్: ప్రసిద్ధ్ కృష్ణ
ఐపీఎల్ 2025 సీజన్‌లో పర్ఫెక్ట్ క్యాచ్: కమిందు మెండిస్
ఐపీఎల్ 2025 ఆరెంజ్ క్యాప్: సాయి సుదర్శన్
ఐపీఎల్ 2025 ఫెయిర్ ప్లే అవార్డు: చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ 2025 ఉత్తమ పిచ్ మరియు గ్రౌండ్: ఢిల్లీ (DDCA)
ఐపీఎల్ 2025 ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: సూర్య కుమార్ యాదవ్
#IPL2025 | #IPLFinals - Royal Challengers Bengaluru end 17-year wait to win the Indian Premier League trophy
— ET NOW (@ETNOWlive) June 4, 2025
The top honours for the 74-match tournament, however, were led by other teams that made playoffs
Mumbai Indians' Suryakumar Yadav took home the Most Valuable Player of… pic.twitter.com/iZSl2svymw