V6 News

ఐపీఎల్‌‌ నుంచి పైన్, ఖలీల్  ఔట్‌‌

ఐపీఎల్‌‌ నుంచి పైన్, ఖలీల్  ఔట్‌‌

హైదరాబాద్‌‌: ఐపీఎల్‌‌–19లో సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్‌‌ స్టార్‌‌ పేసర్‌‌ డేవిడ్‌‌ పైన్‌‌ చీలమండ గాయంతో మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ గురువారం అధికారికంగా ప్రకటించింది. ఆస్ట్రేలియా ఆల్‌‌రౌండర్​ జాక్‌‌ ఎడ్వర్డ్స్‌‌ గాయపడటంతో అతని ప్లేస్‌‌లో పేన్‌‌ను తీసుకున్నారు. ఈ సీజన్‌‌లో రెండు మ్యాచ్‌‌ల్లో ఆడిన పైన్‌‌ రెండు వికెట్లు తీశాడు. 

కానీ ఇప్పుడు గాయంతో టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు మరోవైపు తొడ కండరాల గాయంతో సీఎస్కే పేసర్‌‌ ఖలీల్‌‌ అహ్మద్‌‌ కూడా మెగా లీగ్‌‌ నుంచి తప్పుకున్నాడు. ఈ సీజన్‌‌లో చెన్నై ఆడిన ఐదు మ్యాచ్‌‌ల్లోనూ ఖలీల్‌‌ బరిలోకి దిగాడు. అయితే 14న కోల్‌‌కతాతో జరిగిన మ్యాచ్‌‌లో బౌలింగ్‌‌ చేస్తున్నప్పుడు అతని కుడి తుంటి ఎముక భాగంలో నొప్పి మొదలైంది. పరీక్షలు నిర్వహించగా గ్రేడ్‌‌–2 గాయంగా తేలింది.   కోలుకోవడానికి కనీసం 10 నుంచి 12 వారాల టైమ్‌‌ పట్టనుంది.